దేశ రాజధాని ఢిల్లీ కరోనాకు ఆయువుగా మారుతోంది. అక్కడ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 25వేల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో ఉంటున్న ప్రజలే కాదు.. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మాజీ ప్రధానికి కరోనా నిర్ధారణ అయ్యింది.
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ సైతం కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.
మార్చి 4న మన్మోహన్ సింగ్, ఆయన సతీమణి గుర్ శరణ్ కౌర్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నారు. అయినా కూడా తాజాగా కరోనా బారిన పడడం గమనార్హం.
తాజాగా దేశంలో కరోనా తీవ్రమవుతోందని.. నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొంటూ ఇటీవలే మన్మోహన్ సింగ్ ప్రధాని మోడీకి సుధీర్ఘ లేఖ రాశారు. కరోనా నివారణ తీసుకోవాల్సిన కొన్ని సూచనలను మోడీకి చేశారు.