దేశవ్యాప్తంగా 20వేలు దాటిన కోరనా కేసులు

Update: 2020-04-22 04:45 GMT
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్ లోనూ వేగంగా వ్యాపిస్తుండడం కలకలం రేపుతోంది.  తాజాగా భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20వేల మార్కును దాటింది. రాష్ట్రాలు, కేంద్రం ఎంత పకడ్బందీగా ముందుకెళ్తున్న కేసుల తీవ్రత తగ్గక పోవడం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో ఇప్పటివరకు 20,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు భారత వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.    దేశంలో కరోనాతో ఇప్పటివరకు 645మంది మరణించారని కేంద్రం తెలిపింది.  గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1493 పాజిటివ్ కేసులు.. 50 మరణాలు సంభవించినట్టు తెలిపింది.

దేశంలో 15474 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు3870 మంది కరోనానుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు కేంద్రం తెలిపింది.

ప్రధానంగా దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది.  మహారాష్ట్రలో దేశంలోనే అత్యధిక కేసులు 5218 నమోదయ్యాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 251మంది కరోనాతో మరణించారు. ఢిల్లీలో 2156 కేసులు.. 47మంది మృతి చెందారు.

*తెలంగాణలో 1000కి చేరువైన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.   తాజాగా ఈరోజు మరో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క సూర్యపేటలోనే 26మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం కలకలం రేపింది. హైదరాబాద్ లో 19, గద్వాలలో 2, నిజామాబాద్ లో 3, ఆదిలాబాద్ లో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 928కి చేరింది. మొత్తం తెలంగాణలో కరోనా కారణంగా ఇప్పటివరకు 23మంది చనిపోయారు. 194మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇవాళ ఒక్కరోజే 8మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా సూర్యపేటలో 26 కరోనా పాజిటివ్ కేసులు  నమోదవడంతో  అక్కడికి ప్రత్యేకాధికారులను సీఎం కేసీఆర్ పంపారు.

*ఏపీలో పెరుగుతున్న కరోనా
ఏపీలో కరోనా తీవ్రమవుతోంది. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 761కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 39 కేసులు నమోదయ్యాయి.  కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా  అత్యధికంగా గుంటూరులో 13, కర్నూలులో 10 కేసులున్నాయి.

*ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25.55 లక్షలకు చేరింది.  మొత్తం ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 1,77,641 దాటింది.  అత్యధికంగా అమెరికాలో 45340మంది మరణించారు.  అమెరికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,19,164 లక్షలు దాటింది.    యూరప్ లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కో దేశంలో లక్ష దాటింది. చైనాలో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది.
Tags:    

Similar News