క‌రోనా వ్యాక్సిన్.. అస‌లు క‌థ ఇది

Update: 2020-07-14 03:30 GMT
క‌రోనా వ్యాక్సిన్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా దీని గురించే చ‌ర్చ‌. ఆరు నెల‌లుగా క‌రోనా ధాటికి అల్లాడిపోతున్న ప్ర‌పంచం.. ఎప్పుడెప్పుడు ఈ వైర‌స్‌ను ఆపే వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుందా అని ఎదురు చూస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక దేశాలు ఈ ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్నాయి. దాదాపు 150 దాకా వ్యాక్సిన్ ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి. ఐతే రోజుకో దేశం వ్యాక్సిన్ త‌యారీలో ముంద‌డుగు వేశామ‌ని.. అతి త్వ‌ర‌లో వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తెస్తామ‌ని ప్ర‌క‌టిస్తోంది. మ‌న దేశంలో భార‌త్ బ‌యోటెక్‌తో పాటు జైడ‌స్ క్యాడిలా సంస్థ కూడా క‌రోనా వ్యాక్సిన్ త‌యారీలో నిమ‌గ్న‌మై ఉంది. ఐతే ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్ర‌యోగాల్లో టాప్‌12 స్థానాల్లో ఉన్న సంస్థ‌లు.. అవి త‌యారు చేస్తున్న వ్యాక్సిన్‌ల ప్ర‌స్తుత స్థితి గురించి ఓ మీడియా సంస్థ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

దాని ప్ర‌కారం క‌రోనా పుట్టుక‌కు కేంద్రం అయిన చైనానే వ్యాక్సిన్ త‌యారీలో ముందంజ‌లో ఉంది. అక్క‌డ బీజింగ్‌లోని క్యాన్సినో బ‌య‌లాజిక‌ల్ సంస్థ త‌యారు చేసిన వ్యాక్సిన్‌కు ప్ర‌భుత్వ అనుమ‌తి కూడా ల‌భించింది. ప్ర‌పంచంలో ఇదొక్క‌టే అన్ని ద‌శ‌లూ దాటి ప్ర‌భుత్వ అనుమ‌తి పొందిన వ్యాక్సిన్. అయితే ఇది మార్కెట్లోకి ఎప్పుడొస్తుందో తెలియ‌దు. చైనాకే చెందిన సినోవాక్ ఇన్‌స్టిట్యూట్ త‌యారు చేసిన వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో మూడు ద‌శ‌ల్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. ఇక ప్ర‌భుత్వ అనుమ‌తి రావాల్సి ఉంది. చైనాలోని మ‌రో రెండు సంస్థ‌లు త‌యారు చేసిన ‌వ్యాక్సిన్లు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో రెండు ద‌శ‌లు పూర్తి చేసుకున్నాయి. మూడో ద‌శ పూర్తి చేయ‌డంతో పాటు, అనుమ‌తి పొందాల్సి ఉంది.

ఇక క‌రోనాతో అత్య‌ధికంగా దెబ్బ తిన్న అమెరికాలో నోవావ్యాక్స్, మోడ‌ర్నా సంస్థ‌లు త‌యారు చేస్తున్న రెండు వ్యాక్సిన్లు కూడా స‌రిగ్గా ఈ ద‌శ‌లోనే ఉన్నాయి. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో రెండు ద‌శ‌లు పూర్తి చేసుకున్నాయి. బ్రిట‌న్‌లో ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీ సంయుక్తంగా త‌యారు చేసిన వ్యాక్సిన్.. మూడు ద‌శ‌లు పూర్తి చేసుకుంది. ప్ర‌భుత్వ అనుమ‌తి రావాల్సి ఉంది. అక్క‌డి ఇంపీరియ‌ల్ కాలేజ్ త‌యారు చేసిన వ్యాక్సిన్  క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో రెండు ద‌శ‌లు పూర్తి చేసుకుంది. ఆస్ట్రేలియాలోని వ్యాక్సినా సంస్థ  క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో తొలి ద‌శను ముగించింది. ఇండియాలో భార‌త్ బ‌యోటెక్, జైడ‌స్ సంస్థల వ్యాక్సిన్లు ప్రి క్లినిక‌ల్ టెస్టింగ్ ద‌శ‌లో ఉన్నాయి.
Tags:    

Similar News