అమెరికా ఆస్పత్రుల్లో పేరుకుపోతున్న మృతదేహాలు

Update: 2020-04-15 04:45 GMT
అమెరికాలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. పరిస్థితి బీతావాహంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదయ్యాయి. గంట గంటకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. పలు ఆస్పత్రుల్లో మృతదేహాలు పేరుకుపోతున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలోని న్యూయార్క్ సహా పలు ఆస్పత్రుల్లో శవాలు గుట్టలుగా పేరుకుపోయినట్లుగా బయటకు వచ్చిన ఫొటోలు ఇంటర్నెట్ లో దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. తాజాగా న్యూస్ చానెల్ సీఎన్ఎన్ ఈ ఫొటోలను విడుదల చేయగా ప్రపంచమే షాక్ కు గురైంది.

డెట్రాయిట్ లోని సినాయ్ గ్రేస్ ఆస్పత్రిలో కవర్లలో చుట్టిన మృతదేహాలను ఫ్లోర్ పైనే గుట్టలుగా పడేసిన వైనం విస్తుగొలుపుతోంది. మార్చురీలో శవాలు నిండడంతో వాటిని భద్రపరచడానికి స్థలం లేక ఇలా గదిలో వేసిన దైన్యం కనిపిస్తోంది.

న్యూయార్క్ లో అయితే ఆస్పత్రుల్లో మృతదేహాలను భద్రపరచడానికి స్థలమే లేని పరిస్థితి నెలకొంది. నర్సింగ్ హోంలలో శవాల గుట్టలు కనిపిస్తున్నాయి.  ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన ప్రకారం కరోనా కారణంగా నర్సింగ్‌హోమ్‌లలో మరణించిన వారి సంఖ్య 1,064. అంత్యక్రియలకు స్మశాన వాటికల్లో స్థలం లేక.. సమయం లేకపోవడంతో కొన్ని నర్సింగ్ హోమ్‌లు  గదుల్లో శవాలను కుప్పలుగా పడేస్తున్నారు.

 ప్రస్తుతం అమెరికా లో కరోనా కేసుల సంఖ్య 6 లక్షలకు చేరువ అవుతోంది. అమెరికాలో మరణించిన వారి సంఖ్య  25వేలకు దగ్గరగా ఉంది.  
Tags:    

Similar News