హెచ్1బీ వీసా ఉండి ఇండియాకు వచ్చి చిక్కుకు పోయి..జాబ్ పోతే పరిస్థితేంటి?
కరోనా కారణంగా చోటు చేసుకుంటున్న సిత్రవిచిత్రమైన పరిస్థితులు అన్ని ఇన్ని కావు. ప్రమాదకర వైరస్ కారణంగా యావత్ ప్రపంచం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయిన వేళ.. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో.. ఇప్పటివరకూ ఆలోచనకు రాని కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు చెప్పేది అలాంటిదే. హెచ్1బీ వీసా మీద అమెరికా లో ఉంటూ.. లాక్ డౌన్ కు కాస్త ముందు ఇండియాకు వచ్చారనుకుందాం. కరోనా నేపథ్యంలో అతగాడికి జాబ్ పోయిందనుకుందా? అప్పుడు పరిస్థితి ఏమిటి?
సెలవు మీద ఊరికి వచ్చి.. ఉద్యోగం పోతే.. అమెరికాకు వెళ్లే అవకాశం ఉందా? అంటే.. లేదని తేల్చి చెబుతున్నారు అమెరికాలో అటార్నీగా వ్యవహరించే ప్రముఖురాలు షీలామూర్తి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా కాన్సులేట్లు పని చేయటం లేదని.. అందువల్ల ఉద్యోగాలు పోయిన వారు హెచ్1బీ వీసాలో మార్పుల కోసం అప్లికేషన్ పెట్టుకో లేరని చెబుతున్నారు.
అంతేకాదు.. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం.. అమెరికా లో కాకుండా వేరే దేశంలో ఉన్న వేళలో ఉద్యోగం పోతే.. వారు తిరిగి అమెరికాకు రావటానికి వీలుండదు. అదే జరిగితే.. అక్కడున్న ఇళ్లు.. వాకిలి.. ఇతరత్రా సంగతేమిటి? ఆలోచిస్తేనే టెన్షన్ పుట్టుకు రావటం ఖాయం. మరి.. హెచ్1బీ వీసా మీద అమెరికా లో ఉంటూ ఉద్యోగం పోయినోళ్ల పరిస్థితి ఏమిటి? అన్న సందేహానికి సైతం షీలామూర్తి సమాధానం చెబుతున్నారు.
హెచ్1బీ వీసా మీద అమెరికాలో ఉంటూ.. ఉద్యోగం పోయిన పక్షంలో అలాంటివారు ఆ దేశంలో అరవై రోజుల పాటు ఉండొచ్చు. ఈ లోపు వారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించుకునే వీలుంది.ఆ విషయంలో విజయం సాధించని పక్షంలో వారు తిరిగి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రయత్నం ఫలితే మాత్రం కొత్త కంపెనీ హెచ్1బీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.