కరోనా మహమ్మారిని దేశంలో అరికట్టడానికి కేంద్ర - రాష్ట ప్రభుత్వాలు శతవిధాలా పోరాడుతున్నాయి. ఇందులో భాగంగానే ..లాక్ డౌన్ ను విధించారు. తొలిదశ లాక్ డౌన్ గడువు ముగిసే సమయానికి కరోనా కంట్రోల్ లోకి రాక పోవడంతో మే 3 వరకు మరోసారి లాక్ డౌన్ ను పొడగిస్తునట్టు ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అయితే , ఏప్రిల్ 20 నుండి కొన్ని రంగాలకి లాక్ డౌన్ నుండి సడలింపు ఇచ్చింది. పూర్తిగా మూసేస్తే ..మళ్లీ కోలుకోవడం కష్టం అని భావించిన ప్రభుత్వం కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో పరిశ్రమలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.
ఇక కేంద్రం ఆదేశాలతో ఏపీ సర్కార్ కరోనా ప్రభావం లేని ప్రాంతాలలో పరిశ్రమల్లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చింది.అయితే ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు వాటిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఉద్యోగులు - కార్మికుల్లో నెలకొన్న కరోనా వైరస్ భయాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పరిమిత స్ధాయి లో పరిశ్రమలు తెరవాలని భావించిన యాజమాన్యాలు ఆ మేరకు కార్మికులకు సమాచారం అందించాయి. సోమవారం నుంచి విధుల్లోకి రావాలని కార్మికులను కోరాయి. కానీ వీరిలో చాలా మంది తిరిగి పనిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది
కరోనా భయాలతో గత కొన్ని రోజులుగా ఇంటి వద్దే ఉంటున్న వీరంతా పరిశ్రమల్లోకి రావడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే కార్మికులకు మాత్రం చాలా చోట్ల పాసులు ఇవ్వలేదు. దీంతో వీరంతా పోలీసు ఆంక్షలను దాటుకుని పరిశ్రమలకు రావాల్సి ఉంది. అసలే లాక్ డౌన్ పేరుతో బయట కనిపిస్తే చాలు పోలీసులు ఒళ్ళు హూనం అయ్యేలా కొడుతున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదం పెట్టుకుని మరీ విధుల్లోకి వెళ్లడం అవసరమా అన్న భావన సాధారణ కార్మికుల్లో కనిపిస్తోంది.
గ్రామీణ ప్రాంతాలతో పాటు సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు వెళ్లాలంటే కార్మికులు ప్రజా రవాణాను ఆశ్రయించేవారు. ఆటోలు - బస్సుల్లో పరిశ్రమలకు చేరుకునే వారు. కొన్ని పెద్ద కంపెనీలు మాత్రం కార్మికులకు బస్సు, వ్యాన్ సదుపాయాలు కల్పించేవి. ఇప్పుడు ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోవడం - ప్రస్తుతం ఉన్న నష్టాల పరిస్ధితిలో కార్మికులందరికీ ఉచిత రవాణా కల్పించడం పరిశ్రమలకు తలకు మించిన భారమవుతోంది. రవాణా సౌకర్యం లేక , అలాగే పోలీసులకి ఎలా చెప్పాలో తెలియక చాలామంది ఇంకా కొన్ని రోజులు ఇంట్లో ఉండటానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.