కరోనా లేటెస్ట్ అప్డేట్ : ఏపీలో మరో 82 మందికి కరోనా !

Update: 2020-04-28 06:15 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా పాజిటివ్  కేసుల సంఖ్య ప్రతి రోజు భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 5,783 శాంపిళ్లను పరీక్షించగా 82 మందికి కరోనా  పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత రెండు రోజులుగా 80 కేసుల చొప్పున నమోదవుతున్నాయి. తాజా కేసులు కలిపితే మొత్తం కేసుల సంఖ్య 1259 కాగా.. 258 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారని యాక్టివ్ కేసులు 970గా ఉన్నాయి.

రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 1, చిత్తూరులో 1, గుంటూరు లో 17, కడపలో 7, కృష్ణాలో 13, కర్నూలులో 40, నెల్లూరులో 3 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.  రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 332 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లా 254 కేసులు ఉన్నాయి.. ఇక కృష్ణా జిల్లా కూడా 223 కేసులు  నమోదయ్యాయి.

దేశంలో అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రము ఏపీనే. రెడ్ జోన్లలో అనుమానాస్పద వ్యక్తుల్ని ఎవ్వర్ని విడిచిపెట్టకుండా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు గుంటూరు, నర్సారావుపేట, విజయవాడ లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా ఎవరైనా బయటకు వస్తే, వాళ్లను నేరుగా తీసుకెళ్లి క్వారంటైన్ కేంద్రంలో వేస్తున్నారు. 
Tags:    

Similar News