చాలా సందర్భాల్లో నిబంధనలకు మినహాయింపులు ఇచ్చేస్తుంటుంది ప్రభుత్వం. దానికి కారణం సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వారి కోసమో.. సంపన్న వర్గాల ప్రయోజనాల కోసమో అయి ఉంటుంది. అందుకు భిన్నంగా బడుగుజీవుల కోసం నిర్ణయాలు తీసుకోవటం పెద్దగా కనిపించదు. ఎక్కడిదాకానో ఎందుకు? ఒక సంపన్న వర్గానికి చెందిన ఎవరైనా బాధితులుగా మారితే.. దానికిచ్చే ప్రాధాన్యత.. ఒక బడుగు జీవి విషయంలో ఉండదు.
ఇందుకు భిన్నంగా ఏపీలో చోటు చేసుకున్న పరిణామం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కరోనా వేళ.. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను సీరియస్ గా అమలు చేస్తున్న వేళ.. ఊహించని రీతిలో చోటు చేసుకున్న సీన్ ఒకటి ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ ను విధించటంతో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎంతోమంది తమకు సంబంధం లేని ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు. అలాంటివారి పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. తొలుత 21 రోజులు అనుకున్న లాక్ డౌన్ ఇప్పుడు మే మూడు వరకూ సాగటం.. రానున్న రోజుల్లో లాక్ డౌన్ మరిన్ని రోజులు కనసాగుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
దీంతో.. వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. కర్నూలు జిల్లాకు చెందిన వేలాది మంది వలస కూలీలు వ్యవసాయ పనుల కోసం గుంటూరు జిల్లాకు వచ్చారు. కరోనా పుణ్యమా అని వారంతా తమ సొంతూళ్లకు వెళ్లలేక జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఇలాంటివారంతా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. తమను తమ ఊళ్లకు పంపాలంటూ కనిపించినోళ్లనంతా వేడుకుంటున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అలాంటి వినతుల్ని లైట్ తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ హోంమంత్రి మేకపాటి సుచరిత పత్రిపాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలు పలువురు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఊరి కాని ఊళ్లో.. ఉపాధి లేని వేళ ఉండి పోవటం కష్టంగా మారిందని.. ఏదోలా తమను తమ ఊళ్లకు పంపాలని ప్రాధేయపడ్డారు. వారి వేదనల్ని విన్న సుచరితమ్మ ఊహించని రీతిలో నిర్ణయం తీసుకున్నారు.
ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆమె.. అప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులతో మాట్లాడిన ఆమె.. కూలీలను వారి స్వస్థలాలకు పంపేందుకు వీలుగా రోడ్ల మీదకు ఆర్టీసీ బస్సుల్ని తీసుకొచ్చారు. దీంతో.. తమ సొంతూళ్లకు వెళ్లిపోయే అవకాశం లభించటం తో కూలీలంతా విపరీతమైన ఆనందానికి గురయ్యారు. ఇలా.. మేకపాటి సుచరిత కారణంగా ఏపీలో ఆర్టీసీ బస్సులు రోడ్లు ఎక్కిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.