కరోనా లేటెస్ట్ అప్డేట్ : ఏపీలో మరో 73 మందికి కరోనా !

Update: 2020-04-29 06:45 GMT
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,727 శాంపిళ్లను పరీక్షించగా 73 మందికి కరోనా  పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులు కలిపితే మొత్తం కేసుల సంఖ్య 1,332 కాగా.. 287 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారని యాక్టివ్ కేసులు 1014గా ఉన్నాయి.

రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 4, చిత్తూరులో 3, తూర్పుగోదావరిలో 1, గుంటూరులో 29, కడపలో 4, కృష్ణాలో 13, కర్నూలులో 11, ప్రకాశంలో 4, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 1, పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచడం వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయా లేక... సహజంగానే కేసుల సంఖ్య పెరుగుతోందా అన్నది ఇప్పుడు మిస్టరీ గా మారింది.

గత వారం నుంచి రోజూ దాదాపు 60 నుంచి 80 కేసుల దాకా నమోదవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ర్యాపిడ్ టెస్టుల వల్లే అధిక సంఖ్య లో పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి అని చెప్తుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు ఏం చేస్తున్నా పాజిటివ్ కేసులు ఆగట్లేదు. కరోనా సైకిల్ ప్రకారం మరో వారం తర్వాత... కేసులు కంట్రోల్‌ లోకి వచ్చే అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చు.
Tags:    

Similar News