చైనాలో ‘సార్స్’ను మించి కరోనా మరణమృందంగమా?

Update: 2020-02-16 05:30 GMT
కరోనా వైరస్.. ఈ పేరు చెబితేనే ప్రతి ఒక్కరి వెన్ను లో వణుకు పుడుతోంది. చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ క్రమంగా వివిధ దేశాల్లో విజృభిస్తూ ప్రతి ఒక్కరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వైరస్ తో చైనా లో రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతుండం లో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతోన్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి అడుగుపెట్టేందుకు జంకుతుండటంతో చైనాలోని పట్టణాలన్నీ ఎడారిని తలపిస్తున్నాయి. కరోనా వైరస్ కంటే ముందు 2003లో సార్స్ వైరస్ సోకింది. ఈ వైరస్ వల్ల అప్పట్లో వందలాది మంది చనిపోయాయి. నాటి సార్స్ మృతుల సంఖ్య కంటే అధికంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య అధికం గా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

*కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న చైనా..
కరోనా వైరస్ దెబ్బ కు చైనాలోని ప్రజలు విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ ను గుర్తించిన హుబే ప్రావిన్ల్సోనే ఇప్పటివరకు 780కి పైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఇక చైనా, హంకాంగ్ లతో కలిసి ఈ సంఖ్య మొత్తంగా 803పైగా ఉంటుందని ప్రాంతీయ ఆరోగ్య సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపిన వివరాల ప్రకారం 34,800మంది కరోనా వైరస్ వల్ల బాధడుతున్నారని, వీరిలో ఎక్కువగా చైనాకు చెందిన వారే ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ వ్యాప్తం గా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే చైనాలో కరోనా మృతులను దాస్తోందని బయట ప్రపంచానికి చెప్పడం లేదని డబ్ల్యూ హెచ్ ఓ అనుమానిస్తోంది. వేల సంఖ్య లో మరణిస్తున్నా చెప్పడం లేదని తెలుస్తోంది.

చైనాతోపాటు హంకాంగ్, ఫిలిప్ఫీన్స్ లో కరోనా సోకి మృతిచెందిన కేసులు నమోదయ్యాయి. చైనాలో శనివారం ఒక్కరోజే ఏకంగా కరోనా వైరస్ సోకి 81మంది మృతిచెందారు. వుహాన్ లోని జిన్యింటాన్ ఆసుపత్రిలో అమెరికాకు చెందిన 60ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. చైనాలో కరోనా వైరస్ తో మృతిచెందిన తొలి విదేశీయుడిగా నమోదయ్యాడు. అలాగే ఫ్రాన్స్ లో 21 కరోనా కేసులను గుర్తించారు. వీరిలో ఐదుగురు బ్రిటన్ కు చెందిన వారు, ఒకరు సింగపూర్ కు చెందినవారు ఉన్నారు. వీరికి చికిత్స అందిస్తున్నట్లు ప్రాన్స్ ప్రకటించింది. అయితే కరోనా వైరస్ ను ముందుగానే గుర్తించి హెచ్చరించేందుకు యత్నించిన డాక్టర్ లీ వెన్లియాంగ్ ఆ వైరస్ వల్ల మృతిచెందాడంతోవ విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా ప్రపంచ దేశాలను భయపెడుతున్న కరోనా వైరస్ కు ఇంకా మందు కనుక్కోక పోవడంతో ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ కరోనా వైరస్ చిన్నారులపై ప్రభావం చూపక పోవడం గమనార్హం.


Tags:    

Similar News