ప్రపంచాన్ని ఓవైపు కరోనా కబళిస్తోంది. ఇప్పటివరకు మందులేని ఈ మహమ్మారి బారిన పడకుండా దేశాలకు దేశాలే లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ కు మందు కనిపెట్టే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు.
అన్ని దేశాలతోపాటు భారత్ లో ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఇన్నోవేషన్ ల్యాబ్, లైఫ్ సైన్సెస్ విభాగానికి చెందిన సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్ తయారీ లో ముందడుగు వేశారు. వైరస్ తో పోరాడే 31 రకాల రసాయలనాల సమ్మేళలనాలను కనిపెట్టినట్టు తెలిసింది. పరీక్షలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది.
ఇప్పటికే మలేరియా, హెచ్.ఐ.వీ నివారణ కోసం అందుబాటులో ఉన్న మందులను కరోనా బాధితులకు వాడి రోగ నిరోధక శక్తిని పెంచుతున్నారు.
తాజాగా అసోం టీ తాగితే కరోనా టీ రాదన్న పుకారు సోషల్ మీడియాలో వ్యాపించింది. దీనిపై ప్రఖ్యాత సీఎన్ఎన్ చానెల్ పరిశోధన చేసి ఓ కథనాన్ని ప్రసారం చేసింది. అదిప్పుడు సంచలనం రేపుతోంది.
కరోనా వైరస్ ను చైనాలో తొలుత కనిపెట్టి ప్రపంచాన్ని హెచ్చరించి దానికే బలి అయిపోయిన చైనా డాక్టర్ లీ వెన్లియాంగ్ రాసుకున్న పరిశోధనల నోట్స్ లో ఓ పేరా ఆసక్తి రేపుతోందని సీఎన్ఎన్ తెలిపింది. రోజూ తాగే టీలో కరోనా విరుగుడు లక్షణాలున్నాయంటూ డాక్టర్ లీ తెలిపారంటూ కథనంలో ప్రసారం చేశారు. అయితే ఇది కూడా తప్పుడు కథనం అని అనేవారు లేకపోలేదు. చూడాలి మరి కరోనాకు మందు కనిపెట్టేదాకా ఈ పుకార్లు ఆగక పోవచ్చు.