ఒక్కడి వల్ల 40 మంది డాక్టర్లు - సిబ్బంది క్వారంటైన్

Update: 2020-04-25 09:30 GMT
కరోనా రక్కసి ఎవ్వరినీ వదలడం లేదు. దేశంలో కేసుల సంఖ్య పెంచుతూనే ఉంది. ఎంత కంట్రోల్ చేయాలని చూస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. అయితే కరోనాపై పోరాడుతున్న పోలీసులు, శానిటేషన్ సిబ్బంది, ఆఖరకు వైద్యులకు సోకుతుండడం కలవరపెడుతోంది. డాక్టర్లకే కరోనా సోకుతుండడంతో ఇక చికిత్స చేయడానికి వైద్యుల కొరత తీవ్రంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో 30 ఏళ్ల మేల్ నర్సుకు కరోనా వైరస్ సోకింది. దీంతో అక్కడ పనిచేస్తున్న 40 మంది డాక్టర్లు, వైద్య సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశించారు.

ఇక సదురు మేల్ నర్సు పనిచేసే వార్డులోని రోగుల శాంపిళ్లను కూడా సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో 22 మందికి నెగెటివ్ వచ్చింది. మరిన్ని రిపోర్టులు రావాల్సి ఉంది.

ఇక మేల్ నర్సు ప్రస్తుతం ఎయిమ్స్ లోనే చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీలో ఇప్పటివరకు 2376మందికి కరోనా పాజిటివ్ రాగా.. మరణించిన వారి సంఖ్య 50కి చేరింది.
Tags:    

Similar News