భారతదేశంలో నివసించే రెండు రకాల గబ్భిలాలో కరోనా వైరస్ కనిపించింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ , పుణె లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ ఆ గబ్బిలాలు ఏవంటే... ఒకటి ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ - రెండోది రౌసెటస. చైనాలో కరోనా వైరస్ వచ్చాక - గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాపించి ఉండొచ్చనే డౌట్స్ వచ్చాయి. కానీ నిర్ధారణ కాలేదు. ఈ పరిస్థితుల్లో ఇండియాలో కూడా గబ్బిలాలు ఉంటాయి కాబట్టి ఎందుకైనా మంచిదని వాటిని పరిశోధించారు.
కేరళ - తమిళనాడు - హిమాచల్ ప్రదేశ్ - పుదుచ్చేరి రాష్ట్రాల్లోని ఈ రెండు జాతులకు చెందిన 25 గబ్బిలాల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. వైరస్‌ని గుర్తించేందుకు రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ చైన్ రియాక్షన్ అనే పరీక్ష జరపగా కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంతకీ ఈ గబ్బిలాలకు ఆ వైరస్ ఎలా వచ్చింది అన్నది ఓ ప్రశ్న. అలాగే... ఈ గబ్బిలాల వల్ల మనుషులకు ఆ వైరస్ వ్యాపిస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడే చెప్పలేము అని వారు తెలిపారు.
2018 - 2019లో తెలంగాణ - కేరళ - కర్ణాటక - తమిళనాడు - హిమాచల్ ప్రదేశ్ - పంజాబ్ - గుజరాత్ - ఒడిశా - చండీగఢ్ - పుదుచ్చేరిల్లోని అడవుల్లో గబ్బిలాలపై పరిశోధన జరిగింది. కేరళలోని రౌసెటస్ గబ్బిలాల నుంచి తీసుకున్న 4 శాంపిల్స్ లో పుదుచ్చేరి - హిమాచల్ ప్రదేశ్ - తమిళనాడులోని ఇండియన్ ఫ్లైయింగ్ ఫాక్స్ నుంచి తీసుకున్న 21 శాంపిళ్లలో కరోనా వైరస్ కనిపించింది. తెలంగాణతోపాటూ మిగతా రాష్ట్రాల నుంచి తెచ్చిన శాంపిల్స్ లో కరోనా వైరస్ కనిపించలేదు. ప్రపంచంలో రకరకాల వైరస్ లను గబ్బిలాలు తట్టుకోగలవు. అంటే ఆ వైరస్ లు బాడీలోకి వెళ్లినా... గబ్బిలాలకు ఏమీ కాదు. వాటిలో అలాంటి పవర్ ఫుల్ రోగ నిరోధక వ్యవస్థ ఉంది. అయితే గబ్బిలాల లాలాజలం - మూత్రం - లేదా అవి ఏదైనా తిని పడేసిన వాటి నుంచి - కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనలు తెలిపారు.