షాక్: అలాంటి దేశం ఇప్పుడలా తయారైందా?

Update: 2020-03-30 06:00 GMT
సంపన్న దేశం. దేనికి కొరత లేని బుజ్జి దేశం. ఆ దేశ ప్రజలంతా హ్యాపీగా.. పెద్ద సమస్యలు లేకుండా బతికేస్తుంటారు. మనలాంటి దేశాల్లో కనిపించే చాలా సమస్యలు ఇటలీ లాంటి దేశాల్లో కనిపించవు. ఎలాంటి లోటు లేకుండా వారి జీవితాల్లో కరోనా రేపిన కలకలం అంతా ఇంతా కాదు. తిండికి.. బట్టకు లోటు లేకపోవటమే కాదు.. ఆకలితో చనిపోయే పరిస్థితి దాదాపుగా కనిపించదు. నాగరిక సమాజాలకు.. సంపన్న దేశాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఇటలీలాంటి దేశంలో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు షాకింగ్ గా మారాయి.

కరోనా తీవ్రత అంతకంతకూ పెరిగిపోవటం.. ఆ దేశంలోని కొన్నినగరాలు.. పట్టణాల్లో ప్రజలు వందలాదిగా కరోనా బారిన పడటంతో.. తీవ్రమైన పరిమితులు విధించారు. ఇలాంటివేళ.. ఆకలితో నకనకలాడుతున్న ప్రజలు.. ఏకంగా సూపర్ మార్కెట్ల మీదకుపడి లూటీ చేసేస్తున్నారు. దొరికిన వస్తువును దొరికినట్లుగా తీసేసుకుంటూ వెళ్లి పోతున్నారు. తమ చేతుల్లో డబ్బుల్లేవని.. ముందు ఏదోలా బతకాలి కదా? అంటూ పరుగులు తీస్తున్న తీరు చూసినప్పుడు.. కరోనా ముందు వరకూ వ్యవహరించిన దేశ ప్రజలకు ఇప్పటికి ఏ మాత్రం సంబంధం లేదని చెబుతన్నారు. దీంతో.. సూపర్ మార్కెట్లను లూటీ కాకుండా ఆపేందుకు పోలీసులు తుపాకులతో పహరా కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా కారణంగా ఆ దేశంలో చనిపోతున్న వారి సంఖ్య వేలల్లో ఉండటంతో..వారి అంతిమ సంస్కారాలు చేయటానికి అవసరమైన శవపేటికలు లేకపోవటంతో.. వాటి కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

ఇటలీ.. స్పెయిన్.. ఫ్రాన్స తో సహా మరో ఆరు దేశాలు తమను ఆదుకోవాలంటూ యూరోపియన్ యూనియన్ ను అభ్యర్థిస్తున్నాయి. మొత్తం 27 దేశాలతో కూడిన ఈయూ ఏర్పడిన తర్వాత ఇంత దారుణమైన పరిస్థితి ఇప్పటివరకూ ఎప్పుడూ చోటు చేసుకోలేదంటున్నారు. తమకు ఎదురైన ఇబ్బందుల్ని అందరూ కలిసి పంచుకుందామన్న మాటను మిగిలిన దేశాలు అస్సలు పట్టించుకోవటం లేదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. జర్మనీ.. నెదర్లాండ్స్ లాంటి దేశాలు తమ దగ్గరున్న మాస్కులు.. శానిటైజర్లు ఇవ్వటానికి సైతం నో అంటున్నాయి.

 దీంతో.. ఇటలీ.. ఫ్రాన్స్.. స్పెయిన్ దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాయి. మరోవైపు.. స్పెయిన్ లో ఒక్క ఆదివారమే ఏకంగా 838 మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ దేశంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు 78,797కు చేరుకుంటే.. ఇప్పటివరకూ మరణాలు 6,528 చోటు చేసుకున్నాయి. కరనా కారణంగా ఎక్కువమంది మరణించిన దేశాల్లో ఇటలీ తర్వాత స్పెయిన్ దే కావటం గమనార్హం.
Tags:    

Similar News