బ్రేకింగ్ : మర్కజ్ ఒక్కటే కాదు .. ఆ దర్గాకి వెళ్లిన వారికి కరోనా !

Update: 2020-04-13 05:30 GMT
కరోనా వైరస్ దేశంలో రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. అయితే , ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే .. భారత్ ప్రస్తుతం సేఫ్ జోన్ లో ఉన్నపటికీ  కూడా, కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా కట్టడిలోకి వస్తుంది అని అనుకున్న తరుణంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఘటన ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. మర్కజ్ వెళ్లి వచ్చిన పలువురికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా నిర్మల్ జిల్లాలో మరో కలకలం రేగింది. మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారికే కాదు.. యూపీలోని దేవ్‌ బంధ్ దర్గాకు వెళ్లి వచ్చన వారికి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. మర్కజ్‌ తో పాటు ఇప్పుడు తెర పైకి ఉత్తరప్రదే శ్‌లోని దేవ్‌ బంద్‌ దర్గా నుంచి కూడా ఈ కరోనా వ్యాప్తి జరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఇప్పుడు  వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లాకి చెందిన జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు, మర్కజ్‌తో పాటు.. దేవ్‌ బంద్ దర్గాకు వెళ్లి వచ్చిన విషయాన్నిగోప్యంగా ఉంచడంతో ఆ ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే, ఈ ముగ్గురికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా ..వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది.

దీనితో వీరిపై ఐపీసీ సెక్షన్‌ 269,270,271, సెక్షన్-3 ఎపిడమిక్ యాక్ట్ 1897తో పాటు.. 54 of నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్మెంట్ 2005 కింద కేసులు నమోదు చేశారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి, పలు అధికారిక కార్యక్రమాలకు, రివ్యూ మీటింగ్‌ లకు కూడా హాజరైనట్లు సమాచారం. అలాగే పలువురు జిల్లాకు చెందిన అధికారులు, కీలక కీలక ఉన్నతాధికారులను సైతం కలిశారన్నట్లు  సమాచారం. దీంతో ఆ వ్యక్తి అక్కడికి వెళ్లి వచ్చిన తరువాత ఎవరెవరిని కలిశారన్న దానిపై ఇప్పుడు  అధికారులు ఆరా తీస్తున్నారు.
Tags:    

Similar News