ఊహకు అందని పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది లాక్ డౌన్. కంటికి కనిపించని మాయదారి వైరస్ అంతు చూసేందుకు లాక్ డౌన్ విధించి.. యావత్ దేశంలోని కార్యకలాపాల్ని స్తంభించేలా నిర్ణయం తీసుకుంటే.. సందట్లో సడేమియా అన్న చందంగా చోటు చేసుకుంటున్న పరిణామాలకుకొదవ ఉండటం లేదు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
యూపీకి చెందిన ఒక కుర్రాడు ఇంట్లోకి సరుకులు తెచ్చేందుకు బయటకు వెళ్లమని తల్లి చెప్పింది. సరుకులు తెచ్చేందుకు బయటకు వెళ్లిన ఆ కుర్రాడు కొన్ని గంటల్లో తనతో పాటు.. ఒక అమ్మాయిని తీసుకొచ్చి.. తాను పెళ్లి చేసుకున్నట్లు చెప్పి షాకిచ్చాడు. కొడుకు చేసిన పనికి షాక్ తిన్న ఆమె.. కొత్త కోడల్ని ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చేది లేదని తేల్చేసింది. దీంతో.. యవ్వారం పోలీస్ స్టేషన్ కు మారింది.
లాక్ డౌన్ నేపథ్యంలో తానింతవరకూ ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టలేదని.. కొడుకు చేసిన ఘనకార్యంతో తాను పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లుగా సదరు తల్లి వాపోయింది. తన కొడుకు పెళ్లి చేసుకున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. అయితే.. తమకు పెళ్లి చేసిన పురోహితుడు మాత్రం.. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే పెళ్లి సర్టిఫికేట్ ఇప్పిస్తానని చెప్పారని.. తమను ఇంట్లోకి వెళ్లటానికి అనుమతించాల్సిందిగా సదరు కుర్రాడు కోరాడు.
వీరికి సంబంధించిన ఫోటోను యూపీకి చెందిన జర్నలిస్టు ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేసి.. విషయాన్ని వెల్లడించటంతో ఈ వ్యవహారం వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఎవరికి తోచిన రీతిలో వారు రియాక్టు అవుతున్నారు. ఇలాంటివి యూపీలో మాత్రమే చోటు చేసుకుంటాయన్న ఫన్నీ కామెంట్ తో పాటు.. రేపు సరుకులు కొనేందుకు బయటకు వెళుతున్నానంటూ కొంటెగా వ్యాఖ్యను పోస్టు చేశారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. వీరి పంచాయితీ ఏమైంది? కొడుకు చేసుకున్న పెళ్లికి తల్లి కన్వీన్స్ అయ్యారా? ఇంటికి వెళ్లారా? లాంటి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. దీంతో.. సగం సినిమా చూసి బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో.. సేమ్ అలాంటి పరిస్థితే.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారి పరిస్థితి ఉందని చెప్పక తప్పదు.