యూపీలో కరోనా బీభత్సం ...అన్ని చోట్లా అంబులెన్సులు, కుప్పలుగా శవాలే !

Update: 2021-04-22 01:30 GMT
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా యూపీ లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కానీ , ప్రభుత్వం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్తుంది. గత సంవత్సరం కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన దగ్గర నుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌ లో  మొత్తం 8,51,620 కోవిడ్ కేసులు, 9,830 మరణాలు నమోదయ్యాయి. కరోనా సెకండ్ వేవ్‌ తో పోల్చుకుంటే ఫస్ట్ వేవ్ ‌లో ఉత్తర్ ‌ప్రదేశ్‌ పరిస్థితి మరీ ఇంత ఘోరంగా లేదు. ఇకపోతే , రాజకీయంగా కూడా ఉత్తర్‌ ప్రదేశ్ చాలా ముఖ్యమైనది. యూపీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో సహా 80 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తో సహా, ఆయన కేబినెట్ అనుచరులు, ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు అనేకమంది కోవిడ్ బారినపడ్డారు. గత కొన్ని రోజులుగా హాస్పిటల్స్ లో బెడ్స్ లేక ఆస్పత్రి బయటే ఉంటున్న ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.

రాజధాని లఖ్‌నవూ పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉంది. కారులో కూర్చుని ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఉన్న సుశీల్ కుమార్ శ్రీవాస్తవ అనే పెద్దాయన ఫొటో అందరినీ కదిలిస్తోంది. ఆయన కుమారులు ఆయన్ను ఒక ఆస్పత్రి నుంచి మరొక ఆస్పత్రికి తిప్పుతూనే ఉన్నారు. గానీ బెడ్ దొరకలేదు. మర్నాడు ఒక ఆస్పత్రిలో బెడ్ దొరికింది. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన చనిపోయారు. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో గత గురువారం 70 ఏళ్ల నిర్మలా కపూర్ కరోనాతో ఒక ఆస్పత్రిలో మరణించారు. ఇలాంటి పరిస్థితిని నేను ఇంతకుముందెప్పుడూ చూడలేదు. ఎక్కడ చూసినా అంబులెన్సులు, శవాలే కనిపిస్తున్నాయి. అయితే , తగినన్ని కోవిడ్ పరీక్షలు చేయకుండా, ప్రైవేటు ల్యాబ్‌ ల డాటా కలుపుకోకుండా, కావాలనే కోవిడ్ కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితి అసాధారణంగా ఉంది. ఉత్తర్ ‌ప్రదేశ్‌ లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోవడమే కాక డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆరోగ్య కార్యకర్తలు అనేకమంది కరోన బారిన పడుతున్నారు. 200 శాతం పని చేయాల్సిన చోట, 100 శాతం కూడా చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆరోగ్య రంగం మొత్తం మ్యాన్‌పవర్ మీదే ఆధారపడి ఉంది అని వారణాసిలోని హెరిటేజ్ హాస్పిటల్స్ డైరెక్టర్ అన్షుమన్ రాయ్ తెలిపారు. సెకండ్ వేవ్ ప్రభావాన్ని అంచనా వేయడంలో ఉత్తర్‌ ప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.సెప్టెంబర్, ఫిబ్రవరి మధ్య పరిస్థితి కొంత మెరుగైందని, ఆ సమయంలో వైద్య సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిందని విశ్లేషకులు అంటున్నారు. ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయడంతోపాటూ మందులను నిల్వ చేసి ఉండొచ్చు. అవేమి చేయకుండా ఉత్తర్ ప్రదేశ్ అవకాశాన్ని జారవిడుచుకుందని విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News