చైనాలో పుట్టిన ‘కరోనా’ వైరస్ ఇప్పుడు వివిధ దేశాలకు విస్తరిస్తూ ప్రపంచానికి పెను సవాల్ విసురుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ‘హెల్త్ ఎమర్జెన్సీ’ ప్రకటించడానికి రెడీ అయ్యిందన్న వార్తలు గుబులు రేపుతున్నాయి.
ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బ కు 100 మందికి పైగా చనిపోయారు. వైరస్ తీవ్రత కారణంగా చైనా ఆర్థిక శాఖ 9 బిలియన్ డాలర్లు ప్రకటించి మహమ్మారిని తరిమివేసేందుకు నడుం బిగించింది. ప్రస్తుతం చైనాలో 2744మందికి వ్యాధి సోకినట్టు గుర్తించారు. 461మంది చావుబతుకుల మధ్య ఉన్నారు.
ఇక చైనా నుంచి ఇండియా కు ఈ వైరస్ పాకుతున్నట్టు వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చైనా నుంచి ఇండియాకు వచ్చిన వారితో వ్యాధి సంక్రమిస్తోందని అంటున్నారు. భారత ప్రభుత్వం సైతం ముందు జాగ్రత్త చర్యలకు ఉప క్రమించింది. వ్యాధి నివారణా చర్యల పై అవగాహన కల్పిస్తోంది.
తాజాగా చైనాలోని వుహాన్ లో హుబి యూనివర్సిటీలో చిక్కుకున్న భారత విద్యార్థులను పంపించడానికి చైనా అంగీకరించింది. మమ్మల్ని స్వదేశానికి తీసుకు పోండి అన్న భారతీయ విద్యార్థుల విన్నపం మేరకు ఇండియన్ ఎయిర్ లైన్స్ ప్రత్యేక విమానాన్ని భారత ప్రభుత్వం అక్కడికి పంపించింది. వైద్య పరీక్షలు చేసి వారికి వ్యాధి సోకిందో లేదో నిర్ధారించనున్నారు.