కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,29,913కు చేరుకున్నాయి. మొత్తం కేసులు 20,34,309కి పెరిగాయి. ఇందులో 4,95,679 మంది రికవరీ అయ్యారు. గత పదిపదిహేను రోజులుగా అమెరికాలో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ రోజు ఆ సంఖ్య తగ్గింది. ఈ రోజు అమెరికాలో 270 మంది (మొత్తం 26,317) - స్పెయిన్ 324 మంది (మొత్తం 18,579) - ఇటలీలో 578 మంది (మొత్తం 21,645) - యూకేలో 761 మంది (మొత్తం 12,868) చనిపోయారు.
ఇండియా విషయానికి వస్తే నేటికి 12,320 కేసులు నమోదు కాగా - 405 మరణాలు సంభవించాయి. ఈ ఒక్కరోజే 833 కొత్త కేసులు నమోదు కాగా - 12 మంది చనిపోయారు. ఎన్నో దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాలు - కేసుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రతి పది లక్షలమందిలో 0.3 శాతం మరణాలు - 9 కేసులు నమోదవుతున్నాయి. అదే అమెరికాలో 80 మరణాలు - 1,869 కేసులు ఉన్నాయి. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1578కి చేరుకుంది. 24 గంటల్లో కొత్తగా 17 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు 23 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం 525కు చేరుకున్నాయి. అంతకుముందు 19 కేసులు ఉన్నాయి. ఈ రోజు మొత్తం 42 కేసులు పాజిటివ్ గా తేలాయి. ఈ రోజు ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా - మొత్తం సంఖ్య 14గా ఉంది. గుంటూరులో అత్యధికంగా 122 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం - విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు లేదు.
తెలంగాణ విషయానికి వస్తే కేసుల సంఖ్య ఈ రోజు మరింతగా పెరిగింది. ఆరుగురికి కరోనా నిర్ధారణ కావడంతో వ్యాధి సోకిన వారి సంఖ్య 650కి పెరిగింది. ఇందులో 118 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 18 మంది మృతి చెందారు. 514 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలో ఎక్కువగా 267 కేసులు ఉండగా - ఆ తర్వాత నిజామాబాద్ - వికారాబాద్ లలో ఉన్నాయి. జనగామలో ఒక్క కేసు లేదు.