కరోనా లేటెస్ట్ అప్డేట్ : ఏపీలో 572 - తెలంగాణాలో 706 ..!

Update: 2020-04-17 10:10 GMT
ఏపీలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో 38కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం  కరోనా కేసుల సంఖ్య 572కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గడచిన 24 గంటల్లో జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో.. కర్నూలు జిల్లాలో 13 - నెల్లూరు 6. అనంతపురం 5 - చిత్తూరు 5 - కృష్ణా 4 - గుంటూరు 4 - కడప 1 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే , రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 35 మంది డిశ్చార్జ్‌ కాగా - 14 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 523 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరు - కర్నూల్ జిల్లాల్లో 126 కేసులు నమోదు అయ్యాయి.

ఇకపోతే , తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గురువారం (ఏప్రిల్ 16) ఒక్క రోజే 50 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 700 మార్కుకు చేరుకోగా.. శుక్రవారం ఉదయం మరో 6 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య  706 కి చేరింది.  తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ పంజా విసురుతుండటం ఆందోళన కల్గిస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతానికి పైగా మర్కజ్ మూలాలున్నవే కావడం గమనార్హం. అలాగే కరోనా కారణంగా ఇప్పటివరకు 18 మంది మరణించారు. ఇకపోతే ,ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 13,495 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారిలో 1,777 మంది కరోనా పై పోరాడి విజయం సాధించగా ..448 మంది మృతి చెందారు. 


Tags:    

Similar News