కరోనా అప్ డేట్ :ఆంధ్ర లో మళ్ళి పెరుగుతున్న కరోనా కేసులు!

Update: 2020-04-10 15:50 GMT
కరోనా వైరస్‌ ఆంధ్రప్రదేశ్‌ లో వేగంగా విస్తరిస్తోంది. ఇన్నాళ్లు తక్కువ సంఖ్యలో ఉన్న ఆ వైరస్‌ కేసులు గత వారం నుంచి నుంచి పదుల సంఖ్యలో ఉంటున్నాయి. రోజు రోజుకు క్రమక్రమేణా కేసులు పెరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరు లో 7 - తూర్పు గోదావరి లో 5 - కర్నూల్ లో 2 - ప్రకాశం లో 2 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కల్లోలం రేగుతోంది. కొత్తగా నమోదైన 16 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 381 కి చేరుకుంది.

రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లోని దాదాపు అన్ని జిల్లాలకు కరోనా వైరస్‌ పాకుతోంది. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 381 పాజిటివ్ కేసులకు గాను 10 మంది డిశ్చార్జ్ కాగా ఆరుగురు(అనంతపూర్ 2 - కృష్ణా 2 - గుంటూరు 1 - కర్నూల్ 1) మరణించారు. ఇప్పటివరకు 365 మంది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు

అయితే ఆంధ్రప్రదేశ్‌ లో మొదట తక్కువ సంఖ్యలో ఉన్న కరోనా వైరస్‌ ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో అనూహ్యంగా ఆ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. దీనితో  వారిని - వారి కుటుంబసభ్యులను ఐసోలేషన్‌ కేంద్రంలో ఉంచారు. వారికి సత్వరమే వైద్యం అందిస్తున్నారు. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నారు.

అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లో పకడ్బందీగా లాక్‌ డౌన్‌ అమలుచేస్తున్నారు. ఎవరినీ బయట తిరగనీయడం లేదు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సిబ్బంది నిత్యావసర సరుకులు - నగదు సహాయం అందిస్తున్నారు.

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి

జిల్లా                   పాజిటివ్                     కోలుకున్నవారు

అనంతపూర్              15
చిత్తూర్                    20                               1
ఈస్ట్ గోదావరి             17                                1
గుంటూరు                 58
కడప                      29
కృష్ణా                      35                               2
కర్నూల్                  77
నెల్లూరు                  48                                1
ప్రకాశం                   40                                1
శ్రీకాకుళం                  0
విశాఖపట్నం             20                               4
విజయనగరం              0                             
వెస్ట్ గోదావరి             22                               
Tags:    

Similar News