ప్రపంచం హాహాకారాలు చేస్తుంటే.. అక్కడ మాత్రం సీన్ భిన్నం

Update: 2020-03-28 01:30 GMT
సూర్యోదయం తో మొదలయ్యే అనిశ్చితి.. చీకట్లు కమ్మిన తర్వాత కూడా కొనసాగటం.. అది రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏళ్లకు ఏళ్లుగా సాగే దేశాలు ప్రపంచ పటం మీద చాలానే ఉంటాయి. ఎక్కడి దాకానో ఎందుకు? సిరియా ప్రజల అవస్థలు.. అగచాట్లు.. బతుకు కోసం వారు పడే కష్టం చూసినప్పుడు అయ్యో పాపం అనేటోళ్లు కనిపిస్తుంది తప్పించి.. వారి గురించి.. వారి కష్టాల్ని తీర్చటం కోసం ప్రపంచంలోని సంపన్న దేశాలు పట్టించుకున్నది లేదు.

మీ బతుకు మీది అనే కన్నా.. వారి బతుకుల్ని ఒక లెక్కలోకి కూడా తీసుకునే వారు. కరోనా మహమ్మారి ప్రపంచం మీద కత్తి కట్టిన వేళ.. భూతల స్వర్గాలుగా చెప్పునే దేశాలు కాస్తా ఇప్పుడు శవాల కుప్పలతో.. ఏడ్చేందుకు సైతం శక్తి లేక సొమ్మసిల్లిపోయిన పరిస్థితి. మొన్నటి దాకా అగ్రరాజ్యాలుగా వెలిగిపోయి.. సంపదతోపాటు.. సుఖ సంతోషాలతో తిరుగులేని దేశాలుగా ఉన్నవి కాస్తా ఈ రోజు ఎప్పుడు వైరస్ బారిన పడి చచ్చిపోతామో తెలీని దుస్థితి. ఇందుకు భిన్నంగా.. మొన్నటి వరకూ బతుకు పోరు కోసం కిందామీదా పడిన దేశాలు ఇప్పుడు అందుకు భిన్నంగా కనిపించటం చూస్తే.. ఈ క్రెడిట్ మొత్తం కరోనాకే చెందుతుందని చెప్పాలి.

మొన్నటివరకూ శాపగ్రస్త దేశాలుగా ప్రపంచం ముందు దీనంగా ఉండే కొన్ని దేశాలు.. కరోనా బారిన పడకుండా ఉంటే.. తమకు తిరుగు లేదన్న ధీమాను ప్రదర్శిస్తూ.. ఎంజాయ్ చేయటానికే పుట్టినట్లుగా ఉన్న కొన్ని దేశాలు ఈ రోజున కరోనా భయంతో వణికిపోతున్న పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 5.32లక్షల కేసులు నమోదైతే.. అందుకు చికిత్స పొంది.. బాగైన వారు 1.24లక్షల మంది. ఇక.. ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య కూడా తక్కువేం కాదు. ఏకంగా 24,089 మంది. పాతిక వేలకు దగ్గరగా ఉన్నారు.

ఇందులో అమెరికాలో పాజిటివ్ కేులు 86వేల కేసులు అయితే.. మరణాలు 1300 మంది. తర్వాతి స్థానంలో చైనా.. మూడో స్థానంలో ఇటలీ (న80,589 కేసులుపాజిటివ్ అయితే మరణించిన వారు 8215 మంది, స్పెయిన్ 57,786 మందికి కరోనా సోకితే.. 4365 మంది మరణించారు) అగ్ర రాజ్యాలుగా .. సంపన్న దేశాలుగా ఒకవెలుగు వెలిగిన దేశాలు కరోనా ధాటికి కుదేలు అయితే.. నిత్యం ఏం జరుగుతుందో అర్థం కాక.. బతికితే చాలన్నట్లుగా అనిశ్చితికి లోనయ్యే దేశాల్లో కరోనా ప్రభావం చాలా చాలా తక్కువగా ఉండటం గమనార్హం.

నరరూప రాక్షసులు లాంటి ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ప్రభావం ఉండి.. నరకం అంటే ఏమిటో చూసిన సిరియాలో కేవలం ఐదు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక.. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలీని సోమాలియా.. బ్రెజిట్.. సూడాన్.. జింబాంబ్వే.. పాలస్తీనా దేశాల్లో కరోన కంట్రోల్ తో ఉండటం విశేషం. విదేశీ రాకపోకలు పెద్దగా లేకపోవటం కూడా.. వ్యాధి వ్యాపించక పోవటానికి కారణంగా చెబుతున్నారు. వేలాది మంది తమ జీవితాలు ప్రమాదంలో పడి.. రోదనలు మిన్నంటి ఉన్న వేళ.. అదేమీ పట్టించుకోకుండా తమ పనులతో తాము తిరిగిన ప్రాశ్చాత్యులు ఇప్పుడు ఇంటి వద్దే బందీలుగా ఉండిపోవటం చూస్తే..కాల చక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న భావన కలగటం ఖాయం.

అనిశ్చితి అనుక్షణం తారసపడే దేశాల్లో కరోనా వ్యాప్తి కేసులు ఇలా..
లిబియా  1
సోమాలియా 2
బ్రెజిల్  2
సూడాన్  3
జింబాబ్వే 3
సిరియా 5
పాలస్తీనా   84
అఫ్ఘనిస్తాన్ 84
Tags:    

Similar News