వరల్డ్ అప్డేట్: ప్రపంచవ్యాప్తంగా 18 లక్షలు..భారత్ లో 8356

Update: 2020-04-12 06:16 GMT
కరోనా కల్లోలం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరణాల్లో తొలి రికార్డు నమోదైంది. ఆదివారంతో కరోనా మరణాల్లో ప్రపంచంలోనే అమెరికా అగ్రస్థానంలోకి వచ్చేసింది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 108872 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బాధితుల సంఖ్య 18 లక్షలకు చేరువైంది. 24 గంటల్లోనే ఒక్క అమెరికాలోనే  2108 మంది మరణించారు.  ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా - ఇటలీ - స్పెయిన్ - ఫ్రాన్స్ బ్రిటన్ లోనే మరణాలు సంభవిస్తున్నాయి..
 
*ఇటలీలో ఇప్పటివరకు 19468మంది చనిపోయారు.ఇక బ్రిటన్ లో శనివారం 917మంది చనిపోయారు.  మొత్తం బ్రిటన్ లో మరణాల సంఖ్య 10వేలు దాటింది.  ఇటలీ - స్పెయిన్ - ఫ్రాన్స్ లు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోలుకుంటున్నారు.

*బ్రెజిల్ లో కరోనా మృతుల సంఖ్య 1100 మార్క్ దాటింది.  సింగపూర్ లో శనివారం 191 కొత్త కేసులు నమోద్యాయి. ఇందులో 51మంది భారతీయులే ఉన్నారు.
 
*భారత్ లో 8356కు చేరిన కరోనా కేసులు

భారత దేశంలో కరోనా విస్తరిస్తోంది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 8356కు చేరింది. 24 గంటల్లోనే 909 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 34 మరణాలు సంభవించాయి.   కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న తొలి పది రాష్ట్రాల్లో ఏపీ - తెలంగాణలు కూడా ఉన్నాయి. దేశం మొత్తం మీద కరోనా మరణాల సంఖ్య 273కు చేరింది.  మహారాష్ట్ర - ఢిల్లీ - తమిళనాడు - రాజస్థాన్ లో కరోనా తీవ్రత అధికంగా ఉంది.

*ఆంధ్రప్రదేశ్ లో..

*ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రస్తుతం 388 కేసులు యాక్టివ్‌ గా ఉన్నాయి.  ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 11 మంది కోలుకున్నారు.

*తెలంగాణలో

*తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 503గా నమోదైంది. తెలంగాణలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 393గా ఉన్నాయి. ఇప్పటివరకు 14 మంది మృతి చెందగా - 90 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.


Tags:    

Similar News