కరోనా మహమ్మారి ఏపీలో విలయతాండవం చేస్తోంది. కరోనా కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లోనే ఏకంగా 6552 శాంపిల్స్ పరీక్షించగా 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 893కి చేరింది.
కరోనా తో కర్నూలు జిల్లాలో ఇద్దరు - కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య ఏపీలో 27కు చేరింది. 21 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కర్నూలులో అత్యధికంగా 234 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత గుంటూరులో 195 కేసులున్నాయి.
*తెలంగాణలో 1000కి చేరువైన కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. కాగా వీటితో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 943కి చేరాయి. ఇప్పటివరకూ కరోనాతో 24 మంది మృతి చెందారు. అలాగే 194 మంది డిశ్చార్జ్ అయ్యారు. సూర్యపేట, వికారాబాద్, గద్వాలలో కొత్త కేసులు వెలుగుచూశాయి.
*భారతదేశంలో
కరోనా మహమ్మారి భారత్ లోనూ వేగంగా వ్యాపిస్తుండడం కలకలం రేపుతోంది. తాజాగా భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21393కి చేరుకున్నాయి. రాష్ట్రాలు - కేంద్రం ఎంత పకడ్బందీగా ముందుకెళ్తున్న కేసుల తీవ్రత తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 681మంది మరణించారని కేంద్రం తెలిపింది. దేశంలో 16454 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు 4258 మంది కరోనానుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు కేంద్రం తెలిపింది.
ప్రధానంగా దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి.
*ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26.23 లక్షలు దాటింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 1,83,027 దాటింది. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల్లో ఆదేశంలో 1738మంది మరణించారు. బుధవారం 2751మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో 852703మంది వైరస్ బారిన పడగా.. 47750మంది మరణించారు. యూరప్ లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కో దేశంలో లక్ష దాటింది. చైనాలోని వూహాన్ లో 70 రోజుల తర్వాత కూడా మళ్లీ కరోనా రోగులకు వైరస్ తిరగబడుతోంది. తాజాగా మల్లీ కేసులు నమోదయ్యాయి.