తెలంగాణ‌లో కొత్త‌గా 11 పాజిటివ్‌: వెయ్యి దాటిన క‌రోనా కేసులు

Update: 2020-04-26 16:15 GMT
తెలంగాణలో కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టిందని సంతోషిస్తున్న స‌మ‌యంలో మ‌ళ్లీ స్వ‌ల్పంగా కేసులు పెరిగాయి. తెలంగాణ‌లో శనివారం 7 కేసులు నమోదు కాగా క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని భావించ‌గా ఆదివారం 11 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆదివారం నమోదైన 11 కేసులన్నీ జీహెచ్‌ ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. కొత్త కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 1,001కి చేరాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 660 మందికి చికిత్స అందిస్తున్నారు. 316 మందిని డిశ్చార్జ్‌ చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 25 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ఈ కేసుల‌న్నీ హైద‌రాబాద్ ప‌రిధిలోనే న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో జిల్లాల్లో తాజా గణాంకాలను పరిశీలిస్తే జిల్లాల్లో కరోనా ప్రభావం కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది. క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం.. పెద్ద ఎత్తున క‌రోనా బాధితులు కోలుకుంటుండ‌డంతో రాష్ట్రంలోని రెడ్ జోన్‌ల‌ను ఎత్తేస్తున్నారు. ఆ ప్రాంతాల‌ను గ్రీన్ జోన్ ప‌రిధిలోకి తీసుకొస్తున్నారు. క‌రోనా క‌ట్ట‌డిపై నిరంత‌రం వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. క‌రోనా బాధితుల కోసం హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రి, టిమ్స్ ఆస్ప‌త్రుల్లో వైద్యం అందిస్తున్నారు.

Tags:    

Similar News