తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడిన వారికి హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చినా వారిని వెంటనే గాంధీ ఆస్పత్రిలో చేర్పిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో గాంధీ ఆస్పత్రిని మొత్తం కరోనా ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో ఆ ఆస్పత్రిలో వైద్యులు - వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో ఆ ఆస్పత్రి సిబ్బంది అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అయితే గాంధీ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు అందరి ప్రశంసలు పొందుతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు - వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలకు అనుగుణంగా ఆస్పత్రిలో వైద్య సేవలు సత్వరమే అందిస్తున్నారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రికి పెద్ద దిక్కుగా ఉన్న సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శ్రవణ్ కుమార్ నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు. వైద్యులు - వైద్య సిబ్బంది అవసరాలు తీరుస్తూ.. బాధితులకు సత్వరమే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. దీంతో ఆయన అనుక్షణం కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉన్నారు. ఈ సమయం లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కరోనా మరణించిన వారి మృత దేహాలకు అటాప్సీ చేస్తే వైరస్ కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని తెలిపారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతితో పాటు నిర్ధిష్టమైన నిబంధనలు రూపొందించాలని పేర్కొన్నారు. అటాప్సీతో కరోనా వైరస్ మానవ శరీరంలో ఏయే అవయవాలపై ఎంత ప్రభావం చూపించింది? మృతికి కారణం - వైరస్ బలం - బలహీనతలను అంచనా వేసే అవకాశం ఉందని వివరించారు. గాంధీ ఆస్పత్రి మార్చురీలో కరోనా మృతదేహాలను హైపోక్లోరైడ్ - లైజాల్ వంటి ప్రత్యేకమైన ద్రావణాలతో శుభ్రపరిచి - ఇతరులకు వైరస్ వ్యాపించకుండా జిప్ బ్యాగ్ లో సీల్ చేసి కుటుంబసభ్యులకు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆ విధంగా చేయడంతోనే ఇతరులకు కరోనా వైరస్ సోకదని స్పష్టం చేశారు.
కరోనా వైరస్ నేపథ్యంలో బాధితులు, అనుమానితులతో పాటు సుమారు 1,500 మంది వైద్యసిబ్బంది - మరో 200 మంది పోలీసులు గాంధీ ఆస్పత్రిలో పని చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో వైరస్ వ్యాపించకుండా మూడు సేప్టీ టన్నెల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడంతో త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఆస్పత్రిలో వైద్యులు - సిబ్బంది - ఇతర అధికారులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తున్నారని, వారికి ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నట్లు వివరించారు. వైద్యులు - సిబ్బందిని మూడు గ్రూపులుగా విభజించి ఒక గ్రూప్‌నకు విశ్రాంతి ఇచ్చి మిగిలిన వారు విధులు నిర్వర్తించేలా కార్యాచరణ అమలుచేస్తున్నట్లు తెలిపారు. సెక్రియాట్రీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో నిరంతరం కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు - వైఫై - ల్యాప్ టాప్ - ఫోన్ వంటి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఆస్పత్రిలో వైద్యులు - అధికారులతో 16 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని - ఆయా కమిటీలు పకడ్బందీగా పనిచేస్తుండడంతోనే వైద్య సేవలు సత్వరం అందుతున్నాయని పేర్కొన్నారు.
అయితే కరోనా పాజిటివ్ బాధితులపాటు వారి కుటుంబసభ్యులు - వైద్య సేవలు అందిస్తున్నవారికి మాత్రమే క్లోరోక్విన్ మాత్రలు ఇస్తున్నట్లు చెప్పారు. ఆ మాత్రలు తగినన్ని అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గుండె సంబంధిత వ్యాధులు తదితర రుగ్మతలు ఉన్నవారు వైద్య సలహా మేరకే ఈ మాత్రలు వాడాలని సూచిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ పై వైద్యులు - సిబ్బందికి కరోనాపై అధ్యయన - శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు - ఇప్పటివరకు గాంధీ వైద్యులు - సిబ్బందికి కరోనా వైరస్ సోకకుండా పూర్తిస్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
కరోనా పాజిటివ్ కేసులకు వైద్యం అందించడం సులువు కానీ, బాధితులు - అనుమానితులకు వేర్వేరుగా వైద్యసేవలు అందించడం తలనొప్పి వ్యవహారమని పేర్కొన్నారు. గచ్చిబౌలిలో ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే గాంధీలో ఉన్న అనుమానితులకు అక్కడికి తరలించే అవకాశం ఉందని తెలిపారు. గాంధీ ఆస్పత్రి ఎప్పటికీ కోవిడ్ ఆస్పత్రిగా ఉండదని, నాలుగు నెలల తర్వాత సాధారణ వైద్యసేవలు అందుబాటు లోకి వస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం అందిస్తున్న వైద్య సేవలతో మరో రెండు నెలల్లో కరోనా రహిత తెలంగాణ ఆవిష్కృతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా పాజిటివ్ బాధితులకు అందిస్తున్న వైద్యంతో నెలరోజుల్లో కోలుకుంటున్నారు. అందరూ సహకరిస్తే రెండు నెలల్లో కరోనా వైరస్ లేని తెలంగాణను చూడవచ్చని ఆకాంక్షించారు.