బ్యాంకుల నుంచి భారీ ఎత్తున అప్పులను తీసుకుని - వాటిని తిరిగి చెల్లించుకుండా లండన్ కు పరారై అక్కడే తలదాచుకుంటున్న విజయ్ మాల్యా విషయంలో ఆస్తుల స్వాధీనం - వేలం ప్రక్రియలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పడిన కన్సార్షియం ఇప్పటి వరకూ మాల్యా నుంచి తిరిగి రాబట్టిన సొమ్ముల గురించి సమాచారం అందుతూ ఉంది. ఇప్పటి వరకూ మాల్యాకు సంబంధించిన వివిధ ఆస్తుల వేలం ప్రక్రియ ద్వారా.. సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకూ రాబట్టినట్టుగా సమాచారం.
ప్రధానంగా ఎస్ బీఐ ఈ రికవరీలో కొంత వరకూ డబ్బులను పొందినట్టుగా సమాచారం. మాల్యా పేరిట ఉన్న ఆస్తుల వేలం ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. వివిధ ఆస్తులను వేలం వేసి అమ్మేశారు కూడా. కుదువలో ఉన్న ఆస్తులను ఇలా అమ్మేశారు. మాల్యా ఆస్తుల వేలం ప్రక్రియకు కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ వెయ్యి కోట్ల రూపాయలను రాబట్టారట.
అయితే ఇప్పటి వరకూ రాబట్టిన మొత్తంతో.. మాల్యా చేసిన అప్పులను పరిశీలిస్తే.. పెండింగ్ కథ ఏంటి? అనే సందేహం తలెత్తుతుంది. మాల్యా బ్యాంకులకు బకాయి పడ్డ మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అని ఒక అంచనా. మాల్యా పరార్ అయ్యే నాటి నుంచి ఈ మాట వినిపిస్తూ ఉంది.
ఆ తర్వాత వడ్డీల సంగతి బ్యాంకులకే తెలియాలి. మరి తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో వెయ్యి కోట్ల రూపాయలను రికవరీ చేసినట్టుగా చెబుతున్నారు. దాదాపు పది శాతం మొత్తాన్ని రికవరీ చేశారు. ఇంకా తొంభై శాతం రికవరీ చేయాల్సి ఉందన మాట. అందుకు సంబంధించి మాల్యా ఆస్తులు ఏం తనఖాలో ఉన్నాయనేది శేష ప్రశ్న. యూబీ గ్రూప్ కు సంబంధించిన కొన్ని షేర్స్ ఉన్నాయని.. వాటిని కూడా బ్యాంకులు వేలం వేయవచ్చనే మాట వినిపిస్తూ ఉంది.