దశాబ్దాల కల నెరవేరుతున్నందుకు సంతోషించాలా? ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న కేసు విచారణ చివరకు వచ్చేసిన వేళ.. మచ్చ మీద పడితే అంతకుమించిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇలాంటి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు తొంభై రెండేళ్ల బీజేపీ కురు వృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ. అన్ని ఎదుటే ఉన్నా.. దేన్ని తినలేని చిత్రమైన పరిస్థితే అద్వానీది. తిరుగులేని రీతిలో పార్టీ బలోపేతం కావటం.. కనుచూపు మేర బీజేపీ తప్పించి మరో పార్టీకి అధికార పగ్గాలు చేతికి అందే అవకాశం లేని పరిస్థితుల్లోనూ.. తన కల అయిన ప్రధాని.. రాష్ట్రపతి పదవిని చేపట్టలేని ఇబ్బందికర పరిస్థితి అద్వానీ.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి పదవి లభించే అవకాశం లేదు. కానీ.. ఆయనపై ఎంతోకాలంగా ఉన్న అయోధ్యలోని వివాదాస్పద కట్టటం కూల్చివేత కేసు నుంచి అయినా ఉపశమనం లభిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడుప్రశ్నగా మారింది. ఒక్కొక్క ఇటుక పేర్చి మరీ బీజేపీ ఇప్పుడున్న స్థితికి తీసుకురావటంలో అద్వానీ పాత్రను తక్కువ చేయలేం. ఆయనకు సన్నిహిత మిత్రుడైన వాజ్ పేయ్ దేశ ప్రధానిగా పని చేశారు. ఆయనకు మాత్రం అలాంటి అవకాశం లభించలేదు. ప్రతి సందర్భంలోనూ అద్వానీకి అత్యున్నత పదవిని చేపట్టే అవకాశం లేకుండా ఏదో ఒక వివాదం ఆయన్ను వెంటాడుతూనే ఉండేది.
కోవింద్ కు రాష్ట్రపతి పదవి లభించాల్సింది కాదని.. అద్వానీకి చెందాల్సిందని ఆయన్నుఅభిమానించే వారంతా భావిస్తారు. కానీ.. ఆయన మీద ఉన్న కేసు నేపథ్యంలో రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయలేని పరిస్థితి. రాష్ట్రపతి పదవికి అద్వానీని ఎంపిక చేస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే మోడీ ఆ నిర్ణయాన్ని తీసుకోలేదని చెబుతారు. నిజానికి కోవింద్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినంతనే బీజేపీ నేతలు మాత్రమే కాదు.. అభిమానులు.. సానుభూతిపరులు.. ఆ మాటకు వస్తే దేశ ప్రజలు సైతం విస్మయానికి గురయ్యారు.
ఇదంతా గతమైతే.. వర్తమానం మరింత చిత్రంగా మారింది. వచ్చే నెల ఐదున అయోధ్యలో రామాలయ నిర్మాణంలో కీలకమైన భూమిపూజ ఘట్టానికి ముహుర్తంగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ప్రధాని మోడీ సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. భూమిపూజకు అద్వానీతో పాటు.. రామాలయం కోసం ఉద్యమించిన మురళీ మనోహర్ జోషీ.. ఉమాభారతితో సహా పలువురు నేతలు హాజరు కానున్నారు.
అదే సమయంలో వివాదాస్పద కట్టటం కూల్చివేతకు సంబంధించిన కేసులో వీరంతా నిందితులుగా ఉండటం తెలిసిందే. తాజాగా వీరి వాంగ్మూలాల్ని నమోదు చేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం డేట్స్ ను ఫిక్స్ చేసింది. ఈ నెల 23న వీడియో కాన్ఫరెన్సు ద్వారా వినిపించే వాంగ్మూలాల్ని కోర్టు రికార్డు చేయనుంది. ఈ కేసులో సంబంధం ఉందని చెప్పే ముప్ఫైరెండు మంది తమ వాదనను వినిపించాల్సి ఉంది. వివాదాస్పద కట్టడం కూల్చివేతకు సంబంధించి అద్వానీతో సహా పలువురుసీనియర్ నేతలపై ఉన్న కేసుల్ని కొట్టివేయాల్సిందిగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేస్తున్నారు. అయితే.. దీనిపై బీజేపీ అధినాయకత్వం మౌనం వహిస్తోంది.
అయోధ్య భూవివాదానికి సంబంధించి సుప్రీం తన తుది తీర్పును వెలువరించిన నేపథ్యంలో.. మళ్లీ వివాదాస్పద కట్టడంపై విచారణ చేపట్టటం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సున్నితమైన అంశం కావటంతో సీబీఐ తీర్పు దేశంలో రాజకీయ వైరుధ్యాలకు అవకాశం ఇస్తుందన్న వాదనను వినిపిస్తున్నారు. మరోవైపు వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసును త్వరగా విచారణ పూర్తి చేయాలని లక్నో కోర్టుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు నెలాఖరు నాటికి దీని సంగతి తేల్చాలని చెబుతున్నారు. ఓపక్క ఏళ్ల నాటి కల నెరవేరుతున్నందుకు సంతోషించాలో.. తాను పోరాడిన అంశానికి సంబంధించిన కేసు వెంటాడుతున్న వైనానికి వేదన చెందాలో అర్థం కాని పరిస్థితిలో బీజేపీ కురు వృద్ధుడు ఉన్నారని చెప్పక తప్పదు.