తెలంగాణలో నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసిన కేసులో కేసీఆర్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు పట్ల నమ్మకం లేదని బీజేపీ, నిందితులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌లను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిట్ తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఆయన విన్నవించారు. అయితే, అడ్వకేట్ జనరల్ వాదనలను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది.
ఎమ్మెల్యేలకు ఎరకేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు సింహయాజీ, రామచంద్రభారతి, నందకుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తును తెలంగాణ ప్రభుత్వం సీవీ ఆనంద్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదంటూ బీజేపీ, నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా కేసును సీబీఐకి అప్పగించింది.
ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, వాంగ్మూలాలను సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సైతం తెలంగాణ హైకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.