సంచలన కేసు: ఆమె అడిగినంత పరిహారం ఇవ్వండి: వైద్యుడికి కోర్టు షాక్..

Update: 2021-12-02 23:30 GMT
ఒక తల్లి ఎన్నో వ్యయ ప్రయాసలు పడితే బిడ్డకు జన్మినిస్తుంది. పండంటి బిడ్డ పుట్టడానికి ఆ తల్లి తగు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా వైద్యుల సూచనలు పాటించాలి. అప్పుడే ఆరోగ్యకరమైన బేబీ జన్మిస్తుంది. అయితే వీటిలో ఏదీ లోపించినా ఆ ప్రభావం బిడ్డపై పడుతుంది. అయితే కొందరు వైద్యులు తన పుట్టుక విషయంలో సరైన సలహాలు ఇవ్వలేదని, అందుకే తాను జన్యులోపంతో పుట్టానని ఓ అమ్మాయి కోర్టు మెట్లెక్కింది. అంతేకాకుండా తనకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇంతకీ ఆ కోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే తప్పకుండా షాక్ అవుతారు.

లండన్ కు చెందిన 20 ఏళ్ల యువతి ఈవీ టూంబ్స్ స్పైనా బిఫిడా అనే లోపంతో జన్మించారు. వెన్నెముక సరిగా ఏర్పడకుండా పుట్టడంతో ఆమె ఇప్పడు రోజు మెడికల్ ట్యూబులను ఏర్పాటు చేసుకొని కష్టాలు పడుతున్నారు. ఈమె పలు దివ్యాంగ ‘షో జంపర్’గా పలు పోటీల్లో పాల్గొని పేరు తెచ్చుకుంది. కొందరు తమ పుట్టుక లోపానికి దేవుడిని నిందిస్తారు. కానీ తన పుట్టుకకు మాత్రం డాక్టర్లుచేసిన నిర్లక్ష్యమేనని అని తెలిపింది. తన తల్లి ప్రెగ్నేన్సీ సమయంలో డాక్టర్ ఫిలిప్ మిచెల్ సరైన సూచనలు ఇవ్వలేదని తెలిపింది. అందుకే నేను ఈ లోపంతో పుట్టానని పేర్కొంది. అంతేకాకుండా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.

ఇందులో భాగంగా ఆమె లండన్ హైకోర్టును ఆశ్రయించి దావా వేసింది. అయితే న్యాయమూర్తి రోసలిండ్ కో క్యూసి.. ఈవీ టూంబ్స్ దావాను సమర్థించారు. ఆమె తల్లికి వైద్యులు ముందుగానే సలహాలు ఇచ్చుంటే బాగుండునని ఒకవేళ ముందుగా సరైన సలహాలు ఇచ్చి ఉంటే ఈవీ టాంబ్స్ స్పెనా బిఫిడా వెన్నెముక లోపంతో జన్మించి ఉండేది కాదని వాదించారు. దీంతో రోసలిండ్ కో క్యూసి వాదనను కోర్టు సమర్ధించింది. ఆమెకు జరిగిన నష్టపరిహారం అందించాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది.

అయితే టూంబ్స్ కోరిన విధంగా నష్టపరిహారం అందించాలని తీర్పునిచ్చింది. దీంతో టూంబ్స్ ప్రస్తుతం హ్యపీగా ఉంది. ఒక అమ్మాయి తన పుట్టుక గురించి ఇలా కోర్టులో దావా వేసి నెగ్గడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దివ్యాంగురాలువని మానసికంగా కుంగిపోకుండా ఇలాగా ప్రతి ఒక్కిరిలో ఆత్మ విశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరు సమర్థులవుతారని అంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టూంబ్స్ ను అందరూ మెచ్చుకుంటున్నారు.
Tags:    

Similar News