ఆమెను చంపింది వాళ్లిద్దరే.. ఆ సీన్ చూసిందనే.. 28ఏళ్ల కేసులో కోర్టు తీర్పు
కేరళ రాష్ట్రంలో 28 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ(21) హత్య కేసులో తిరువనంతపురం లోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఫాదర్ థామస్ కొట్టూర్, సిస్టర్ సెఫీని దోషులుగా తేల్చింది. దోషులకు డిసెంబర్ 23న శిక్ష ఖరారు చేయనున్నట్లు కోర్టు వెల్లడించింది. కోర్టు తీర్పు పట్ల మానవ హక్కుల సంఘం కార్యకర్తలు, అభయ స్నేహితులు హర్హం వ్యక్తంచేశారు.
అసలేం జరిగింది..?
1992 మార్చి 27న, సిస్టర్ అభయ మృతదేహం కొట్టాయంలోని ప్యూయస్ టెన్త్ కాన్వెంట్ బావిలో లభించింది. అప్పటికి ఆమె వయస్స 21 సంవత్సరాలు. అయితే.. ఈ కేసును దర్యాప్తు చేసిన స్థానిక పోలీసులు, రాష్ట్ర నేరశాఖ.. అభయ ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చాయి. కానీ.. ఇది హత్య అంటూ సామాజిక కార్యకర్త జోమోన్ పుథెన్ పురకల్ ఏర్పాటు చేసిన యాక్షన్ కమిటీ పలుమార్లు పిటీషన్లు దాఖలు చేసింది. దీంతో ఈ కేసును 1993 మార్చి 29 న సీబీఐ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగి.. తాజాగా తీర్పు వెలువడింది.
వాళ్ల వ్యవహారం చూసిందనే..
ఫాదర్ థామస్ కొట్టూర్, సిస్టర్ సెఫీ చర్చిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అభయ గుర్తించిందని, అందుకే వారు ఆమెను చంపేశారని సీబీఐ తేల్చింది. 1992 మార్చి 27 తెల్లవారు ఝూమున అభయను సిస్టర్ సెఫీ గొడ్డలితో నరకగా.. ఫాదర్ కొట్టూరు ఆమెను బావిలోకి పడేశారని సీబీఐ కోర్టుకు తెలిపింది. వీరికి సహకరించిన మరో పాధర్ జోస్ పుత్రిక్కాయిల్ కూడా సహకరించారని సీబీఐ పేర్కొంది. ఈ నేరారోపణతో 2008లో ఫాదర్ కొట్టూరు, పుత్రికాయిల్, సెఫీలను సీబీఐ అరెస్ట్ చేసింది. కానీ.. తనను కేసులో అనవసరంగా ఇరికించారని పుత్రికాయిల్ పిటీషన్ దాఖలు చేయగా సీబీఐ కోర్టు అతడ్ని విడుదల చేసింది.
శిక్షఖరారు బుధవారం..
నిందితులపై ఐపీసీ సెక్షన్ 302, 201, 34, కింద సీబీఐ కేసు నమోదు చేసింది. నిందితులు హత్య చేసినట్లు తేలటంతో తిరువనంతపురంలోని కోర్టు మంగళవారం వారిని దోషులుగా ప్రకటించింది. సిస్టర్ అభయ తల్లి నాలుగేళ్ల క్రితం కన్నుమూశారు. కాగా.. సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులకు బుధవారం శిక్షలు ఖరారు చేయనుంది.