ఓవైసీ పంచ్‌ కు బీజేపీకి సుర్రుమంటోంది

Update: 2017-04-02 07:48 GMT
త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి బీజేపీపై ఏఐఎంఐఎం అధినేత - హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ భారీ జోక్ పేల్చారు. గోవధ - పశుమాంసం విక్రయాల విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని ఆయ‌న‌ మండిపడ్డారు. `బీఫ్‌ విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ లో ఆవును మమ్మీ (అమ్మ)గా ప్రచారం చేస్తున్న ఆ పార్టీ.. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం  యమ్మీ (రుచికరమైన మాంసం)గా చూస్తున్న‌ది` అని ఎద్దేవా చేశారు. కబేళాలను మూసివేస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాంసం విక్రయదారులను లక్ష్యంగా చేసుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంద‌ని విమ‌ర్శించారు.

ఒకవైపు యూపీలో కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గోవధ - అక్రమ మాంసం విక్రయాలపై ఉక్కుపాదం మోపుతుండగా.. మరోవైపు ఆ ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపై ఉండబోదని బీజేపీ చెప్తోంది. వచ్చే ఏడాది ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ అధికారంలోకి వస్తే పశుమాంసంపై ఎలాంటి నిషేధం విధించబోమని నాగాలాండ్‌ బీజేపీ చీఫ్‌ విససోలీ లౌంగు స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ఓవైసీ ఈ ట్వీట్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News