రాజకీయాల్లో పొత్తులు మామూలే. కానీ తెలంగాణలో నడుస్తున్న పొత్తు రాజకీయం మాత్రం కొందరికి విసుగు తెప్పిస్తుంటే... ఇంకొందరిలో అనుమానాలు కలిగిస్తోంది. అసలు ఈ పొత్తు పొడుతుస్తుందా లేదా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్న ఈ పొత్తులు ఒక నెల రోజుల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో విసుగెత్తిన సీపీఐ పార్టీ... తాము పోటీ చేయనున్న 9 స్థానాల వివరాలు ప్రకటించి కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చింది. మొదట్నుంచి తమకు ఐదు గౌరవప్రదమైన స్థానాలు ఇస్తే పొత్తుకు ఓకే అని సీపీఐ చెబుతుంటే... కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్లు గెలవరు అనవసరంగా సీట్లు అడుగుతారు అంటూ కామెంట్లు చేస్తోంది. దీనిపై ఈరోజు ఆ పార్టీ సీనియర్ నేత నారాయణ వేసి ప్రశ్నకు కాంగ్రెస్ ఫీజులు ఎగిరిపోయాయి.
** తమ పార్టీ ఏ సీటు అడిగినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని అంటుంది. కాంగ్రెస్ పోటీ చేయాలనుకున్న అన్ని స్థానాల్లో ఆ పార్టీ గెలుస్తుందా.. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ రాసివ్వగలదా?** అని నారాయణ ప్రశ్నించారు. నిజానికి ఇలాంటి లాజిక్ సీపీఐ తీస్తుందని కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు. అస్సలు ఆ మాటొకస్తే ఈ ప్రశ్నకు కాంగ్రెస్ దగ్గర సమాధానం కూడా లేదు.
కాంగ్రెస్ ఆలస్యం వల్ల సమయం అనవసరంగా వృథా అయిపోతోంది. ఏ స్థానాలు వస్తాయో తెలియకపోతే పార్టీలు ఎలా ప్రచారం చేసుకుంటాయి. మంచి అవకావాన్ని ఇలా నాశనం చేసుకుంటే ఎలా గెలుస్తాం అంటూ సీపీఐ ప్రశ్నిస్తోంది.