బిగ్ బాస్ బ్రోతల్ హౌసే.. నారాయణ మళ్లీ మొదలెట్టాడు!

Update: 2022-09-08 12:58 GMT
కమ్యూనిస్టు యోధుడు ఈ ఆధునిక బిగ్ బాస్ ను తట్టుకోలేకపోతున్నాడు. జనాలకు అందరికీ నచ్చుతున్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షో నారాయణకు మాత్రం ‘బ్రోతల్ హౌస్’లా కనిపిస్తోంది. అందుకే మరోసారి నోరు పారేసుకున్నారు. పాత చింతకాయపచ్చడి సిద్ధాంతాలతో ఆధునికానికి అన్వయించుకోవడం లేదని నారాయణను బిగ్ బాస్ ప్రేమికులు తిట్టిపోస్తున్నారు.

బిగ్ బాస్ రియాల్టీ షోపై సీపీఐ నారాయణ మరోసారి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. పదేపదే రియాల్టీ షోపై భగ్గుమంటూనే ఉన్నాడు. అభ్యంతరక వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బస్ ను బ్రౌతల్ హౌస్ అంటూ నోరుపారేసుకున్న నారాయణ మరోసారి అదే మాట అనేశాడు. నారాయణది నోరా? తాటిమట్టనా? అర్థం కావడం లేదని కొందరు విమర్శిస్తున్నారు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై కూడా దారుణ విమర్శలు చేసి మెగాఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు నారాయణ. ఆ తర్వాత సారీ చెప్పి నాలుక కరుచుకున్నాడు. ఇక హీరో నాగార్జునపై , సీఎం కేసీఆర్ ను తిట్టిపోశారు. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ పై పడ్డాడు.

బిగ్ బాస్ రియాల్టీ షో ఓ బ్రోతల్ హౌస్ అని తాను చేసిన కామెంట్స్ కు కట్టుబడి ఉన్నట్టు నారాయణ పేర్కొన్నాడు. బ్రోతల్ హౌస్ లో మహిళలతో పాటు పురుషులు కూడా ఉంటారని చెప్పుకొచ్చారు. మహిళలను కించపరిచినట్టు తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందన్నారు. తనను బ్లాక్ మెయిల్ చేయడం ఎవరి వల్ల కాదని ఆయన హెచ్చరించారు. కళాకారులపై తనకు గౌరవం ఉందన్నారు. సినిమా రంగం అంటే కేవలం హీరో నాగార్జున మాత్రమే కాదని.. డబ్బు కోసం నాగార్జున బిగ్ బాస్ హౌస్ట్ గా చేస్తున్నారని విమర్శించారు. చిరంజీవి మాత్రం ప్రజారోగ్యం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నాడని.. ఇద్దరికీ చాలా తేడా ఉందన్నారు.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ పై కూడా నారాయణ నోరుపారేసుకున్నాడు. మునుగోడులో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇచ్చినా కూడా బీజేపీ ఇంతలా బలపడడానికి కేసీఆరే కారణమని నారాయణ మండిపడ్డారు.  కేసీఆర్ తప్పుల వల్లే తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందన్నారు. ఎంఐఎం భుజంపై తుపాకీ పెట్టి కేసీఆర్ ను బీజేపీ కాలుస్తోందని విమర్శించారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ నుంచి కేసీఆర్ బయటపడాలని హితవు పలికారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News