కేంద్ర ప్రభుత్వ తీరుపై సీపీఐ జాతీయ నేత నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రజల కంప్యూటర్లలోని సమాచారాన్ని కనిపెట్టేందుకు పది భద్రతాసంస్థలకు అనుమతి మంజూరు చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన మండిపడ్డారు. నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే భార్యాభర్తల కాపురంపై కూడా నిఘా పెట్టేలా ఉందని ఎద్దేవా చేశారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల కంప్యూటర్లలోని సమాచారాన్ని కనిపెట్టేందుకు పది భద్రతా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందంటూ మండిపడ్డారు. ఇక.. అగ్రిగోల్డ్ వ్యవహారం ఎన్నికల్లో చంద్రబాబు మెడకు చుట్టుకోనుందని నారాయణ అభిప్రాయపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతోనే కేసీఆర్ ఎన్నికల్లో గెలుపొందారని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్.. మోడీకి పొలిటికల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్.. మోడీ ఉప్పు తిన్నారు కాబట్టే.. ఆయన రుణం తీర్చుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘ పూర్తిగా టీఆర్ ఎస్ కు సపోర్ట్ చేసిందని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలీసులు అధికార పార్టీ నేతలు డబ్బులు పంపిణీ చేస్తుంటే.. వారికి కాపలాగా పనిచేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
కేసీఆర్ కు మెజార్టీ వచ్చినా ఫిరాయింపులను ప్రోత్సహించడమేంటని నారాయణ ప్రశ్నించారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా ఫిరాయించడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులు రాజకీయ వ్యభిచారంతో సమానమని పేర్కొన్నారు. అసెంబ్లీని కూడా కేసీఆర్.. ఫాంహౌస్‌లోనే నడపబోతున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ వ్యవహారం ఎన్నికల్లో చంద్రబాబు మెడకు చుట్టుకోనుందని హెచ్చరించారు. సోహ్రబుద్దీన్ కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అప్పగించాలని నారాయణ డిమాండ్ చేశారు.