చిన్న వయసు కానీ బాధ్యత పెద్దది అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యకు కొత్త అర్థం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాధ్యత పెద్దదైనా.. దాన్ని సమర్థంగా నిర్వర్తిస్తూ..కొత్త విలువలకు.. సరికొత్త సంప్రదాయాలకు తెర తీస్తున్న వైనం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్ కొత్త జపంగా మారారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు నేతలు కలిసినా.. వారి మాటల్లో తప్పనిసరిగా జగన్ ప్రస్తావన రాకుండా ఉండని పరిస్థితి. ఇక.. డైలీ బేసిస్ లో ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన పార్టీలకు అతీతంగా ఆయన పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారు. నిన్నటి వరకూ కాంగ్రెస్ నేతలు అదే పనిగా ప్రస్తావిస్తున్న జగన్ ను.. తాజాగా కమ్యునిస్టు నేతలు సైతం షురూ చేశారు.
పార్టీ ఫిరాయింపులపై జగన్ తీరును చూసైనా నేర్చుకోవాలని సీపీఐ నారాయణ తాజాగా హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో విలీనం చేసుకున్న నేపథ్యంలో.. టీఆర్ఎస్ అధినేత తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. అనుకోని రీతిలో పార్టీ ఫిరాయింపుల మీద నిన్నటి (గురువారం) అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన జగన్ ఇప్పుడు అందరి నోట్లో నానుతున్నారు.
పార్టీ ఫిరాయింపుల్ని అస్సలు సహించొద్దని.. వేలాది మంది ఓటర్లు నమ్మి అసెంబ్లీకి పంపితే.. సిగ్గువిడిచి పార్టీలు మారుతున్న తీరును నారాయణ తప్పు పట్టారు. కేసీఆర్ కంటే జగన్ చిన్నోడని.. కానీ ఫిరాయింపుల విషయంలో మాత్రం జగన్ ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలన్నారు.
ఇదే మాటన ఇప్పటికే పలువురు తెలంగాణ నేతలు అదే పనిగా ప్రస్తావిస్తుండటం గమనార్హం. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ విషయాల్ని అయితే ప్రస్తావిస్తున్నారో.. నారాయణ సైతం అదే అంశాల్ని తెర మీదకు తెస్తూ.. కేసీఆర్ ను తీవ్రస్థాయిలో దునుమాడారు. జగన్ కాళ్ల కింద నుంచి వందసార్లు దూరినా కేసీఆర్ కు బుద్ధి రాదంటూ మండిపడ్డారు. ప్రతిపక్షం లేకుండా ప్రజలే ప్రతిపక్షంగా మారుతారన్న ఆయన.. మోడీ.. అమిత్ షా.. కేసీఆర్ ముగ్గురు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు మొదలు కామ్రేడ్స్ వరకూ అందరి నోట జగన్.. జగన్ అంటూ చేస్తున్న జపం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.