వెంక‌య్య న‌ర‌హంత‌క ముఠా నాయ‌కుడు

Update: 2017-02-25 13:35 GMT

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు కమ్యూనిస్టుల గురించి మాట్లాడే అర్హత లేదని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ వ్యాఖ్యానించారు. ప్రగతిశీల కార్యకర్తలను - వామక్ష నాయకులను హత్యలు చేయించే వాళ్ళు సైతం క‌మ్యూనిస్టుల గురించి మాట్లాడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నరహంతక ముఠాకు నాయకుడు అయిన వెంకయ్య నాయుడు కమ్యూనిస్టుల గురించి అవాకులు చవాకులు మాట్లాడితే ఉరుకోమని తేల్చి చెప్పారు. హైద‌రాబాద్‌ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ భ‌జ‌న‌లో తేలియాడుతున్న వెంక‌య్య‌కు మ‌నుషులు క‌నిపించ‌డం లేద‌న్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో  స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్ర‌హం నారాయ‌ణ‌ వ్య‌క్తం చేశారు. కులాలు - మతాలుగా ప్రజలను విడగొట్టి మాట్లాడడం దురదృష్టకరమ‌ని విమ‌ర్శించారు. అమెరికా ప్రభుత్వం ఆయుధాల తయారీగా మారుతుందని, అక్కడ భారతీయులకు భద్రత లేకుండా పోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న‌రేంద్ర మోడీ అమెరికాల అధ్య‌క్షుడు ట్రంప్‌ తో మాట్లాడి అక్కడ పరిస్థితులను చక్కదిద్దాలని కోరారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెంటనే అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరిపాలని డిమాండ్ చేశారు.

త‌మ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ల‌ల‌లోకి వ‌స్తున్న‌ట్లుందని నారాయ‌ణ‌ ఎద్దేవా చేశారు. దేవుల్ల‌కు ఆభ‌ర‌ణాలు చేయించే సొమ్ము కేసీఆర్ అబ్బ సొత్తో ఆయ‌న సొత్తో అయితే త‌మ‌కు అభ్యంత‌రం లేదని స్ప‌ష్టం చేశారు. ప్రజల‌ సొమ్మును ఇచ్చే అర్హత కేసీఆర్ కు లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాకముందు కమ్యూనిస్టులు మిత్రులు తెలంగాణ వచ్చిన తర్వాత మేము శత్రువులం అయ్యార‌ని నారాయ‌ణ మండిప‌డ్డారు. ఉద్యమం అణిచివేయాల‌ని చూసిన వాళ్ళు మంత్రులుగా కులుకుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉద్యమాన్ని ఊరి బయట పెట్టాలని చుస్తే మిమ్మల్ని కూడా ప్రజలు ఊరి బయటకు పంతారని ప‌రోక్షంగా ఇందిరాపార్క్ త‌ర‌లింపును ప్ర‌స్తావిస్తూ వ్యాఖ్యానించారు. తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ కోదండరాం నిస్వార్థపరుడని, ఆయన్ను విమర్శించడం తెరాస నేతలు మానుకోవాలని సూచించారు.

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కు రోజు రోజుకు పిచ్చి ముదురుతోందని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లిందే అయితే 50 మందితో చైనా పర్యటన, కేరళ పర్యటనలు ఎందుకు చేశార‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కమ్యూనిస్టులను వందల సార్లు పొగిడి ఇప్పుడు విమర్శించడం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. కోట్లాది రూపాయలు యజ్ఞయాగదులు చేసి ప్రజాధనం లూటీ చేస్తున్నారని మండిప‌డ్డారు. మతాలు వ్యక్తిగత నమ్మకం... దానికోసం పేదల సొమ్ము వినియోగించడం సరికాద‌ని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News