కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా.. అదే సీపీఐ పార్టీ. ఎందరో వృద్ధండులు.. మరెందరో అనుభవశాలీలకు నిలయం. దశాబ్దాల చరిత్ర. కానీ.. ఇప్పుడు ఉనికి కోల్పోయి పరువు దిగజార్చుకొని తప్పటడుగులు వేస్తోందన్న విమర్శలున్నాయి. ప్రజాపోరాటాల్లో ఎప్పుడూ ముందుండే వీరు ఇప్పుడు వెనకడుగు వేశారు. సమస్యలపై ప్రజల్లోకి వచ్చి పోరాడే వీరు ఇప్పుడు కేవలం ఒక ప్రెస్ మీట్ తోనే, లేక ప్రకటన, వీడియోనో రిలీజ్ చేసి విమర్శలు గుప్పించి గమ్మునుంటున్నారు. ఒకప్పుడు రోడ్డు మీదనే ఉండి పోరాటాలు చేసే వీరు.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తున్నారు. కరోనా టైంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు.. ప్రభుత్వ వైఫల్యాలు చెప్పేందుకు ఉద్యమించకపోగా కేవలం లెటర్లు రాసి చేతులు దులుపుకున్నారు. దీనిపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి. సీపీఐ నారాయణ సైతం తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసి చెడామడా తిట్టేశారు.
ఏపీ సీఎం జగన్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు పరస్పరం ఆడుతున్న నాటకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చూస్తున్నాడని.. ఆయన అండదండలు ఉన్నంతకాలం జగన్ కు బెయిల్ రద్దు కాదని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఓవైపు జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ వేశారని.. అలాగే రఘురామకృష్ణం రాజు సభ్యత్వం రద్దు చేయాలని వైసీపీ లాబీయింగ్ చేస్తోందని.. వీరిద్దరి ఆటలు సాగవన్నారు. ఏ నిర్ణయం వెలువడదని నారాయణ అన్నారు.
కరోనా నియంత్రణలో కేంద్రం పూర్తిగా ఫెయిల్ అయ్యిందని.. తిరుపతిలో ఆక్సిజన్ లేక 23మంది చనిపోతే 12 మంది అని చెప్పారని సీపీఐ నారాయణ విమర్శించారు. దేశంలో కార్పొరేట్ ఆస్పత్రులు కోవిడ్ వల్ల లాభపడ్డాయని.. 64శాతం వారి ఆస్తులు పెరిగాయన్నారు. అంబానీ, అదానీ ఆస్తులు అమాంతంగా పెరిగాయన్నారు. చనిపోయిన వారికి 5 లక్షలు ఇవ్వలేని కేంద్రం.. కార్పొరేట్ లకు లక్ష అరవై కోట్లు ఇచ్చిందని మండిపడ్డారు.
దేశంలో ఇంత అవమానకరమైన ప్రధాని ఇంకోడు లేడని సీపీఐ నారాయణ నోరు పారేసుకున్నారు. యూపీ ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ దేశాభివృద్ధి మీద లేదన్నారు. వ్యవసాయ చట్టాలు వస్తే రైతులు బానిసలు అవుతారని మండిపడ్డారు.
దేశంలోని ఆర్బీఐ, సీబీఐ, ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థలను డమ్మీ చేశారని.. వాజ్ పేయి మంచి రాజకీయ నేత అని మోడీ ఫ్యాక్షనిస్ట్ అని సీపీఐ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు.
కరోనాతో చనిపోయిన వారికి 5 లక్షలు ఇవ్వలేని కేంద్రం.. కార్పొరేట్ లకు లక్ష అరవై కోట్లు ఇచ్చిందని సీపీఐ నారాయణ విమర్శించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని.. పబ్లిక్ సెక్టార్లు మొత్తం కేంద్రం అమ్మకానికి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.