సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ ఏం మాట్లాడినా సంచలనమే. రాజకీయ ప్రత్యర్థిపై... ప్రత్యేకించి అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన నేతలు - పాలకులపై ఆయన విరుచుకుపడే తీరే విభిన్నంగానే కాకుండా ఆసక్తికరంగానూ ఉంటుందన్న విషయం ఏ ఒక్కరూ కాదనలేని సత్యమే. అసలు నారాయణ ఎప్పుడు ఏ రాజకీయ నేతపై పడతారన్న విషయాన్ని ఊహించడం చాలా కష్టమే. అయితే అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన నేతలు మాత్రం నారాయణ చేసే కామెంట్లు కామనే కదా... అంటూ తుడుచుకుపోతున్నా కూడా ఆయన మాత్రం వారిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే... టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పాలనపై నారాయణ ఇప్పటికే సెటైర్ల మీద సెటైర్లేశారు. జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన దరిమిలా తెలుగు నేలపై గతంలో కంటే కాస్తంత తక్కువ కాలం ఉంటున్న నారాయణ... ఏ చిన్న అవకాశం చిక్కినా కూడా బాబును మాత్రం వదలడం లేదు.
ఈ క్రమంలో మొన్నామధ్య నవ్యాంధ్ర నూనత రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి తాను ఏరికోరి తెచ్చుకున్న నార్మన్ పోస్టర్ నమూనాలు చూసిన చంద్రబాబు... వాటిని ఏమాత్రం ఒప్పుకోలేదట. అంతేకాకుండా తాను అంతగా కష్టపడి కాంట్రాక్టు ఇప్పిస్తే... ఇవేనా మీరిచ్చే డిజైన్లు అంటూ ఆ సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అదే సమయంలో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్యవ్యాప్తం చేసిన దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చేత డిజైన్లు రూపొందించాలని తలచి - ఆ మేరకు రాజమౌళికి కబురు పెట్టండంటూ బాబు ఆదేశాలు జారీ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న నారాయణ... కాసేపటి క్రితం అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా బాబు గారి కొత్త నిర్ణయంపై తనదైన శైలిలో కడిగిపారేశారు.
ఈ సందర్భంగా డిజైన్లే అయినా... మొత్తం రాజధాని వ్యవహారం మొత్తాన్ని గుర్తు చేసిన నారాయణ... ప్రధాని నరేంద్ర మోదీ వద్ద చంద్రబాబు ఎలా సాగిలపడ్డారన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. అయినా ఈ సందర్భంగా నారాయణ ఏమన్నారన్న విషయానికి వస్తే... *ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకుంటున్న చంద్రబాబు.. అదే ప్రధాని మోదీ అమరావతికి వస్తే విమర్శించడంలో అంతర్యం ఏమిటో? అమరావతి డిజైన్లలో టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి సూచనలు పాటిస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు గ్రాఫిక్స్‌కే పరిమితమవుతున్నారు. అయితే ఆ ఊహా ప్రపంచాన్ని విడనాడాలి* అని చంద్రబాబుకు నారాయణ సూచించారు. మరి నారాయణ మాటలను చంద్రబాబు వింటారో, లేదో చూడాలి.