అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతిచ్చారు. శశికళ ఎమ్మెల్యేల మద్దతు ఉందని పేర్కొంటూ అందుకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశమివ్వాలని కోరారు. ఈ సందర్భంగా తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుపై నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కేంద్రానికి కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసలు గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని ఎన్టీఆర్ హయాం నుంచి తాము పోరాటాలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఎప్పటికైనా ఈ పదవి కేంద్రం ఆదేశాలను పాలో అయ్యేందుకు తప్పించి స్వతంత్ర్యంగా వ్యవహరించేందుకు కాదని వ్యాఖ్యానించారు.
కాగా, తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు సోమవారంలోపు తుది నిర్ణయం తీసుకోకపోతే ఈ వ్యవహారాన్ని సవాల్ చేస్తూ ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశముందని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. గవర్నర్ తేల్చకుంటే ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశముందని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నారు. గవర్నర్ తన నిర్ణయాన్ని వాయిదావేస్తూ పన్నీర్‌సెల్వం,-శశికళ మధ్య పందెం నిర్వహిస్తున్నారని విమర్శించారు. మరోవైపు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర నేత రాధాకృష్ణన్ గవర్నర్ విద్యాసాగర్‌రావు చర్యలను సమర్థించారు. త్వరగా తీసుకోవడానికి ఇది పార్టీ నిర్ణయం కాదని, తమిళనాడు భవిష్యత్తు అని పేర్కొన్నారు. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం సుబ్రమణ్యస్వామికి దూరంగా ఉంటోంది. స్వామి భిన్నమైన మార్గం ఎంచుకున్నారు. ఆయన జాతీయ కార్యవర్గసభ్యుడు, ఆయన వ్యాఖ్యలతో రాష్ట్ర బీజేపీకి సంబంధం లేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిలిసై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు.
మరోవైపు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణస్వీకారాన్ని గవర్నర్ విద్యాసాగర్ రావు తన విచక్షణాధికారాలు ఉపయోగించి మరికొన్ని రోజులు వాయిదా వేయవచ్చని, అయితే ఈ ఆలస్యం శశికళ, పన్నీర్ సెల్వం మధ్య పోటీని ప్రోత్సహించినట్టు అవుతున్నదని భారత మాజీ అటార్నీ జనరల్ సోలి జే సొరాబ్జి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ "గవర్నర్ విద్యాసాగర్‌రావు నన్ను సలహా కోరారు. నేను కొన్ని సూచనలు చేశాను"అని తెలిపారు. గవర్నర్ కావాలనే ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేస్తున్నారన్న ఆరోపణలను కొట్టిపారేశారు." ప్రస్తుతం శశికళపై అక్రమాస్తుల కేసు నడుస్తోంది. ఈ వారంలో సుప్రీంకోర్టు తుదితీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో గవర్నర్ తన అధికారాలు ఉపయోగించి ప్రభుత్వ ఏర్పాటును వాయిదా వేయవచ్చు" అని పేర్కొన్నారు. ఈ ఆలస్యం కారణంగా రెండు వర్గాల మధ్య పోటీ నెలకొందన్నారు. కాగా, సోమవారం సుప్రీం విచారించనున్న కేసుల జాబితాలో శశికళ కేసు లేదు. దీంతో మంగళవారం లేదా బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.