క్రికెట్ అంటే భారత్ లో ఒక మతం. క్రికెట్ ఇప్పుడు విశ్వవ్యాప్తం. ఈ ఆట అంటే పడిచచ్చే వారు ఎందరో.. ప్రపంచంలో క్రికెట్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. అంతటి ప్రజాదరణను చూరగొన్న క్రికెట్ ను అతిపెద్ద క్రీడా సంబురమైన ఒలింపిక్స్ లో చేర్చాలని భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డారు.
ఒలింపిక్స్ లో క్రికెట్ ఉండాలన్న వాదనకు తానూ మద్దతు ఇస్తానని ఇటీవల రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నారు. ఒలింపిక్స్ లో క్రికెట్ టీ20 ఫార్మాట్ ను ప్రవేశ పెడితే ఎక్కువ ఆదరణను చూరగొంటుందని అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలో దాదాపు 75 దేశాలు టీ20 ఫార్మాట్ క్రికెట్ ను ఆడుతున్నాయని.. ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెడితే మరింత ప్రాచుర్యం పొందుతుందని రాహుల్ ద్రావిడ్ అన్నారు. క్రికెట్ ఆటకు మెరుగైన సదుపాయాలను, ఏర్పాట్లను చేయాల్సి ఉందన్నారు.
ఈ సందర్భంగా ఐపీఎల్ గురించి కూడా రాహుల్ ద్రావిడ్ ప్రస్తావించారు. ఐపీఎల్ ఆకట్టుకోవడానికి కారణం పిచ్ ల నాణ్యత అని పేర్కొన్నారు. ఒలింపిక్స్ లో కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయగలిగితే క్రికెట్ కు ఆదరణ లభిస్తుందని అన్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రికెట్ ను ఒలింపిక్స్ లో తీసుకురావడానికి సమయం పట్టే అవకాశం ఉందని రాహుల్ ద్రావిడ్ అన్నారు. 2018లో ఐసీసీ నిర్వహించిన సర్వేలోనూ 87శాతం మంది ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చాలని తమ అభిప్రాయం వ్యక్తం చేశారని ద్రావిడ్ తెలిపారు.