హేడెన్ ట్వీట్ కు నెటిజ‌న్ల స‌లామ్‌!

Update: 2017-08-16 19:21 GMT
ఒక దేశ స్వాతంత్ర్య దినోత్స‌వ సంద‌ర్భంగా వేరే దేశాల అధ్య‌క్షులు, సెల‌బ్రిటీలు, ఆటగాళ్లు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం స‌హ‌జం. అయితే, స్వాతంత్ర్యం జ‌రుపుకుంటున్న దేశ‌పు జాతీయ గీతాన్ని త‌మ భాష‌లోకి అనువ‌దించి మ‌రీ శుభాకాంక్ష‌లు తెల‌పడం వినూత్నంగా ఉంది క‌దూ. వినూత్నత‌ర‌హాలో శుభాకాంక్ష‌లు చెప్పి అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన ఆ వ్యక్తి మ‌రెవ‌రో కాదు ....ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ మాథ్యూ హేడెన్. ఈ మాజీ క్రికెట‌ర్ ట్వీట్ పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఆ ట్వీట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయింది.

భార‌త్ తో మ్యాచ్ ఆడుతున్న‌పుడు హేడెన్ ను భార‌త అభిమానులు విల‌న్ లా చూసేవారు. అత‌డు ఎప్పుడు అవుట్ అవుతాడా అంటూ ఎదురుచూసేవారు. అయితే, హేడెన్ ఒక్క ట్వీట్ తో కోట్లాదిమంది భార‌తీయుల‌కు హీరో అయిపోయాడు. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా అత‌డు చేసిన ట్వీట్ తో భార‌తీయుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. హేడెన్ భార‌త జాతీయ గీతాన్ని ఇంగ్లిషు లోకి అనువ‌దించి స‌రికొత్త ప‌ద్ధ‌తిలో శుభాకాంక్ష‌లు తెలప‌డంపై నెటిజ‌న్లు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. హేడెన్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఈ ఇంగ్లిష్ జాతీయ‌గీతానికి చాలా మంది రీట్వీట్లు చేశారు.


Tags:    

Similar News