రైతు ఉద్యమానికి గిల్​ కుటుంబం మద్దతు ..!

Update: 2020-12-04 15:30 GMT
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. హర్యానా, పంజాబ్​ రాష్ట్రాలకు చెందిన రైతులు ఈ బిల్లులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మెల్లగా ఈ ఉద్యమం మిగతా రాష్ట్రాలకు కూడా పాకింది. ప్రస్తుతం ఈ ఉద్యమం రాజస్థాన్​, ఉత్తరప్రదేశ్​, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు పాకింది. కేంద్రప్రభుత్వం చర్చలతో సమస్యలను పరిష్కరించాలని యోచిస్తున్నప్పటికి రైతు సంఘాలు మాత్రం మెత్తబడటం లేదు. కేంద్రం తీసుకొచ్చిన  బిల్లులను రద్దుచేయాల్సిందే అని డిమాండ్​ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రైతు ఉద్యమాలకు పలుసంఘాల నుంచి మద్దతు వస్తున్నది.  అయితే తాజాగా టీం ఇండియా యువ క్రికెటర్​ శుబ్​మన్​ గిల్​ కుటుంబసభ్యులు రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. శుబ్​మన్​ గిల్​ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. గిల్​ కూడా పలుమార్లు వ్యవసాయం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. రిటైర్​ అయ్యాక వ్యవసాయం చేస్తానని కూడా చెప్పాడు. తాజాగా గిల్​ కుటుంబం రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించింది.

ఈ విషయంపై గిల్​ తండ్రి లఖ్వీందర్​సింగ్​ మాట్లాడుతూ.. ‘నూతన వ్యవసాయచట్టానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి తమ కుటుంబం పూర్తి మద్దతు తెలుపుతున్నది. మాది వ్యవయసాయకుటుంబం. గిల్​కు కూడా వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. తాను క్రికెటర్​ కాకపోయి ఉంటు కచ్చితంగా అన్నదాత అయ్యేవాడు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెంటనే వెనక్కి తీసుకొవాలి. ఈ చట్టాలు రైతుల హక్కులను కాలరాసేలా ఉన్నాయి. ఈ విషయంపై గిల్​ ఎలా స్పందిస్తాడో తెలియదు. అతడు టీంఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మా అభిప్రాయాలను మా కుమారుడు అర్థం చేసుకుంటాని భావిస్తున్నాం’ అని ఆయన తండ్రి పేర్కొన్నాడు. అయితే గిల్​ ప్రస్తుతం ఆసిస్​ పర్యటనలో ఉన్నారు.
Tags:    

Similar News