జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!

అక్కడ నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లిన ఆయన... అనంతరం జూబ్లిహిల్స్ లోని ఇంటికి వెళ్లి మీడియాతో మాట్లాడారు.

Update: 2024-12-14 04:14 GMT

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టైన అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి చంచల్ గూడ జైలులోనే ఉన్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం 6:40 గంటల ప్రాంతంలో ఆయన విడుదలయ్యారు. అక్కడ నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లిన ఆయన... అనంతరం జూబ్లిహిల్స్ లోని ఇంటికి వెళ్లి మీడియాతో మాట్లాడారు.

అవును.. చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ జూబ్లిహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్.. తాను చట్టాన్ని గౌరవించే పౌరుడిని అని.. చట్టానికి తాను కట్టుబడి ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా.. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. తాను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఈ ఘటన జరిగిందే తప్ప.. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని స్పష్టం చేశారు.

ఇక.. తాను 20 ఏళ్లుగా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తున్నట్లు చెప్పిన అల్లు అర్జున్.. తన సినిమాలే కాదు, మావయ్య సినిమాలు చూసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా... బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని.. ఈ నేపథ్యంలో అభిమానం, ప్రేమతో అండగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో తాను బాగానే ఉన్నానని.. ఎవరూ ఏమాత్రం ఆందోళన చెందొద్దని ఆయన అభిమానులకు తెలిపారు.

Tags:    

Similar News