క్రీడాలోకంలో తొలి మరణం: వైరస్ కు మాజీ క్రికెటర్ బలి

Update: 2020-06-29 15:30 GMT
ప్రస్తుతం వైరస్‌ తీవ్రంగా ప్రబలుతున్న ప్రాంతాల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ఢిల్లీలో భయాందోళన పరిస్థితి ఏర్పడింది. ప్రజలతో పాటు ప్రముఖులు ఆ వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ వైరస్ క్రీడా రంగానికి క్రమంగా పాకంతోంది. తాజాగా క్రీడా రంగంలో తొలి వైరస్ మృతి నమోదైంది. వైరస్ బారిన పడి ఓ మాజీ క్రికెటర్‌ మృత్యువాత పడ్డారు. అతడే సంజయ్‌ దోబల్‌.

సంజయ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. క్లబ్‌ క్రికెట్‌లో పేరు ప్రఖ్యాతలు సంజయ్ సంపాదించాడు. ఢిల్లీ అండర్‌-23 జట్టుకు సపోర్టింగ్‌ స్టాప్‌కు కూడా సేవలందించారు. ఇటీవల అతడికి వైరస్‌ సోకింది. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న క్రమంలో సంజయ్‌ వైరస్ బారిన పడ్డారు.

మూడు వారాల కిందట అతడికి వైరస్ లక్షణాలు కనిపించాయి. చికిత్స పొందుతుండగా ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. దీంతోపాటు అతడికి ప్లాస్మా థెరఫీ కూడా చేయించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

సంజయ్‌ మృతితో గౌతమ్ గంభీర్ దిగ్ర్భాంతికి గురయ్యారు. సంజయ్ రంజీ ట్రోఫీ ఆడిన అనుభవం లేకపోయినా జూనియర్‌ క్రికెటర్లతో మంచి సాన్నిహిత్యం కలిగి ఉండేవాడు. ఆ క్రమంలోనే గౌతం గంభీర్‌తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.
Tags:    

Similar News