వామ్మో.. కేరళ మరీ ఇంత డేంజరా?

Update: 2017-02-27 04:10 GMT
దేవతలు నడియాడే భూమిగా వర్ణిస్తూ.. భూతల స్వర్గంగా పేర్కొనే కేరళ.. ఎంత దారుణంగా తయారైందన్న చేదు నిజం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఎలాంటి విషయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవకూడదో అలాంటి వార్తలతో బయటకువస్తున్న ఆ రాష్ట్రానికి సంబంధించిన షాకింగ్ విశేషాలు బయటకు వచ్చాయి. తాజాగా విడుదలైన గణాంకాల్ని చూస్తే.. కేరళలో చోటు చేసుకుంటున్న నేరాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.

కేవలం ఒక్క ఏడాది వ్యవధిలో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న నేరాల తీవ్రత చూస్తే.. వామ్మో అంటూ గుండెల మీద చెయ్యి వేసుకోవాల్సిందే. 2016 ఒక్క ఏడాదిలోనే కేరళలోని మహిళలు.. చిన్నారులపై దాదాపు 16,960 నేరాలు చోటు చేసుకోవటమే కాదు.. ఈ నేరాల్లో అత్యాచార ఉదంతాలే 2568గా తేల్చారు.

ఏడాది వ్యవధిలో ఇంత భారీగా అత్యాచార నేరాలు నమోదు కావటం ఇప్పుడా రాష్ట్రంలోని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.మొన్నామధ్య సినీ నటిపై లైంగిక వేధింపులు చోటు చేసుకున్న ఉదంతంతో.. కేరళ ఇమేజ్ దారుణంగా దెబ్బ తిందని చెప్పాలి. తాజా ఉదంతం నేపథ్యంలో కేరళలో లైంగిక నేరాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెక్ చేయాలన్న ప్రయత్నం చేసినప్పుడు షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

2016లో కేరళలో చోటు చేసుకున్న అత్యాచార ఘటనల్లో మహిళలపై1644 జరగగా .. 924 ఘటనలు చిన్నారులపై  జరిగినట్లుగా తేల్చారు. అంతకు ముందుఏడాదితో పోలిస్తే.. ఆందోళనకర స్థాయిలో నేరాల తీవ్రత 2016లో చేసుకోవటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2015లో 1263 మంది మహిళలపైనా.. 720 మంది పిల్లలపై అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నట్లు తాజా అధ్యయనంలో బయటకు వచ్చింది. చూస్తుంటే.. కేరళ పేరు ప్రఖ్యాతుల్ని ఆ ప్రాంత ప్రజలే తమ చేతులతో తామే దారుణంగా దెబ్బ తీసుకున్నట్లు కనిపించట్లేదు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News