తాజాగా దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో కొత్త శాసనసభ కొలువుదీరనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేల స్థితిగతులపై జననాయక సీరమైప్పు కళగం ఓ సర్వే నిర్వహించింది. తాజా ప్రజాప్రతినిధుల విద్యార్హత, ఆదాయం, నేర చరిత్ర తదితర అంశాలపై ఆసక్తికర సమాచారం వెల్లడించింది. ప్రస్తుత శాసనసభ్యుల్లో కోట్లకు పడగలెత్తిన వారు అధిక సంఖ్యలో ఉన్నారని , అలాగే బడి మెట్టు దాటని వారూ భారీగానే ఉన్నట్లు తెలిపింది. క్రిమినల్ కేసులు నమోదైన వారు ఎక్కువగానే ఉన్నారని వివరించింది. తమిళనాడులో కొత్తగా ఎన్నికైన మొత్తం 234 మంది ఎమ్మెల్యేల సమగ్ర వివరాలను జననాయక సీరమైప్పు కళగం సర్వే వెలుగులోకి తీసుకువచ్చింది. తాజా ఎమ్మెల్యేల్లో తిరునల్వేలి జిల్లా అంపసముద్రం నియోజకవర్గం నుంచి గెలుపొందిన సుబ్బయ్య నెంబర్ వన్ కోటీశ్వరుడని సర్వే తేల్చింది. సుమారు రూ.246కోట్ల ఆస్తులతో సుబ్బయ్య ప్రథమస్థానంలో నిలిచారు.
అలాగే తిరుత్తురైపూండి నుంచి సీపీఐ తరఫున ఎన్నికైన మారిముత్త కేవలం రూ.3లక్షల ఆస్తితో చివరిస్థానం దక్కించుకున్నారు. నిరాడంబరమైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. 2016 ఎన్నికల్లో మొత్తం 76మంది కోటీశ్వరులు ఎమ్మెల్యేలుగా గెలవగా, ప్రస్తుతం ఆ సంఖ్య 86కు పెరిగింది. అలాగే 2016లో 34శాతం మంది నేర చరిత్ర ఉన్నవాళ్లు అసెంబ్లీకి ఎన్నికైతే ఇప్పుడు అది 60శాతానికి చేరడం గమనార్హం.
పార్టీ పేరు కోటీశ్వరులైన ఎమ్మెల్యేల శాతం
డీఎంకే 89
అన్నాడీఎంకే 88
కాంగ్రెస్ 58
పీఎంకే 60
బీజేపీ 75
పార్టీ పేరు క్రిమినల్ కేసులు నమోదైనవారి సంఖ్య
డీఎంకే - 36
అన్నాడీఎంకే - 15
కాంగ్రెస్ - 12
పీఎంకే - 04
వీసీకే - 03
బీజేపీ - 04
సీపీఐ - 02
ఎమ్మెల్యేల వయసు వివరాలు :
31–40 ఏళ్ల మధ్య వయస్కులు - 14 మంది
41–50 ఏళ్లు ఉన్నవారు - 60 మంది
51– 70 ఏళ్లు వయసువారు - 135 మంది
71–80 ఏళ్ల మధ్య వయస్కులు- 14 మంది
80 ఏళ్లు దాటినవారు - ఒకరు
ఎమ్మెల్యేల విద్యార్హత :
పాఠశాల విద్యకే పరిమితమైనవారు- 77 మంది
డిగ్రీ అంత కంటే ఎక్కువ చదివినవారు- 136 మంది
వైద్యవిద్య అభ్యసించినవారు- ఆరుగురు