కేసులు, నేతలు ఇలా రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రతి నేతపై కేసులు సర్వసాధారణం. కొందరు ప్రజల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసి కేసుల పాలైతే.. మరికొందరు వివాదాస్పద అంశాలతో కేసుల్లో ఇరుక్కుంటారు.
ఎన్నికల్లో పోటీచేసే ప్రజాప్రతినిధుల కేసులపై ఎప్పుడూ రిపోర్టును బయటపెట్టే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తాజాగా మరోసారి తెలంగాణ నేతల కేసుల చిట్టాను బయటపెట్టింది. రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులపై మొత్తం 509 కేసులు ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తాజాగా తెలిపింది. 64 మంది ఎమ్మెల్యేలపై 346 కేసులు ఉన్నాయని.. మరో 10 మంది ఎంపీలపై 133 కేసులు నమోదయ్యాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది. మాజీ ఎమ్మెల్యేలపై 39 కేసులు నమోదైనట్టు తెలిపింది.
తెలంగాణలో ప్రజాప్రతినిధులపై మొత్తం 509 కేసులు నమోదు కాగా వీటిలో కేవలం 245 కేసులు మాత్రమే ప్రత్యేక కోర్టుల్లో బదిలీ అయ్యాయని స్పష్టం చేసింది. 2018 నుంచి 73 కేసుల్లో తీర్పులు వచ్చినా ఏ ఒక్క ప్రజాప్రతినిధికి శిక్ష పడలేదని తెలిపింది. దీంతో పోలీసులపై అనుమానం వస్తోందని ఆరోపించింది.
తాజాగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు. సుప్రీం కోర్టు నేర చరిత గల ఎమ్మెల్యేలు, ఎంపీపై సత్వరం విచారణకు ప్రత్యేక కోర్టులు నియమించాలని అన్ని రాష్ట్రాలను కోరినా పోలీసులు, ప్రభుత్వం సహకరించడం లేదని.. ఇంకా ప్రత్యేక న్యాయస్థానాలకు కేసులు బదిలీ చేయడం లేదని లేఖలో కోరారు.