పన్నెండు మంది మహిళలపై రేప్.. జడ్జి విధించిన శిక్ష సూపర్

Update: 2023-02-08 10:00 GMT
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన ఒక దుర్మార్గుడికి అదిరే శిక్షను వేశారు న్యాయమూర్తి. ఈ కామపిశాచికి పడాల్సిన శిక్షే పడిందన్న మాట తీర్పు గురించి తెలిసిన వారంతా అనే పరిస్థితి. అయితే.. ఈ శిక్షను భారత సంతతికి చెందిన న్యాయమూర్తి వేయటం ఆసక్తికరంగా మారింది.

యూకేలో ఒక అత్యాచార నిందితుడికి అంచనాలకు అందని రీతిలో వేసిన శిక్ష ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ శిక్షకు సంబంధించిన తీర్పు ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది.

యూకేలోని మెట్రోపాలిటన్ పోలీసు మాజీ అధికారి డేవిడ్ కారిక్ ఒక కామపిశాచి. పదిహేడేళ్ల వ్యవధిలో (2003-2020 మధ్య కాలంలో) దాదాపు 12 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడటమే కాదు.. వారిని తీవ్రంగా హింసించిన సైకో.

అతడు మొత్తం 49 నేరాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసు విచారణ సాగింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి భారత సంతతికి చెందిన పరమ్ జిత్ కౌర్ సంచలన తీర్పును వెలువరించారు.

లండన్ లోని సౌత్ వార్క్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఆమె.. డేవిడ్ కారిక్ కేసును విచారించి.. చివరకు అతడికి 36 యావజ్జీవ కారాగార శిక్షల్ని ఫైనల్ చేస్తూ సంచలన తీర్పును ఇచ్చారు. అంతేకాదు.. ఈ 36 యావజ్జీవ కారాగార శిక్షల్ని ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించారు.

పెరోల్ దరఖాస్తు చేసుకోవటానికి సైతం కనీసం 30 ఏళ్లు జైల్లో ఉన్న తర్వాత మాత్రమే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ తీర్పు ఇప్పుడు యూకేలో పెను సంచలనంగా మారింది. అంతమంది మహిళల ఉసురు తీసుకున్న వాడికి ఆ దారుణ శిక్ష పడాల్సిందే. అందుకు అతడు అర్హుడన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News