బెస్ట్ గోల్ కన్నా ఆమెతో సెక్స్ మిన్న!

Update: 2019-09-19 08:59 GMT
క్రిస్టియానో రోనాల్డో.. ఫుట్ బాల్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు.. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడు ఇతడు.. ఇప్పటివరకు 700 గోల్స్ చేసిన ఈ పోర్చుగల్ ఆటగాడు ఎన్నో అద్భుతమైన విజయాలను తన జట్టుకు అందించాడు. ఇక లీగ్ లలో కూడా ఇతడిని కోట్లు పెట్టి కొనుగోలు చేసి ఆడిస్తుంటారు.

అయితే ప్రపంచం గర్వించే ఈ ఆటగాడు తన కెరీర్ లోనే అత్యుత్తమ గోల్ గా అందరూ అభివర్ణిస్తున్న గోల్ ను తనకు మాత్రం గొప్పది కాదని సంచలన విషయం బయటపెట్టాడు. 2017-18 చాంపియన్ లీగ్ లో క్వార్టర్ ఫైనల్ లో రియల్ మాడ్రిడ్ తరుఫున ఆడిన రోనాల్డో తలకిందులుగా ఎడమకాలితో గోల్ పోస్టులోకి కొట్టిన షాట్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని ఫుట్ బాల్ పండితులు ఘంటాపథంగా చెబుతుంటారు. ఇదే విషయాన్ని తాజాగా ఓ విలేకరి రోనాల్డోను అడిగేశాడు.

‘‘అయితే అందరూ నా ఆ గోల్ ను ప్రశంసిస్తున్నా.. నాకు మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ 24 ఏళ్ల జార్జినా రోడ్రిగ్వేతో సెక్స్ లో లభించే సుఖం కంటే ఆ గోల్ ఎక్కువ తృప్తిని ఇవ్వలేదని ’’ రోనాల్డో హాట్ కామెంట్ చేశాడు..  నేను చేసిన అత్యుత్తమ గోల్ కంటే తన ప్రియసితో సెక్స్ సుఖమే తనకు మిన్న అని రోనాల్డో అనడం విశేషం. ఈ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశమైంది.

34 ఏళ్ల రోనాల్డో ఇప్పటికే  రష్యా మోడల్ ఇరినాతోపాటు ఇద్దరు ముగ్గురితో సహజీవనం చేసి ఆరుగురికి తండ్రి అయ్యాడు. తాజాగా 24 ఏళ్ల స్పెయిన్ మోడల్ జార్జీనా రోడ్రిగ్యూజ్ తో సహజీవనం చేస్తున్నాడు. ఆమెతో ఒక కూతురును కన్నాడు. ఇప్పుడు ఆమె అందం - ప్రేమ చూసి ఆమెను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు.
Tags:    

Similar News